Breaking News Live: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 1న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 1న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా గిరిజా శంకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా కోన శశిధర్, దేవదాయశాఖ కమిషనర్‌గా హరిజవహర్‌లాల్, ఆర్‌అండ్ఆర్ కమిషనర్‌గా జె.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్‌కుమార్ నియమితులయ్యారు. తాజా బదిలీలు, నియామకాలపై సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
రేపటి పవన్ సభకు అనుమతి లేదు : పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కొవిడ్ నిబంధనలు కారణంగా పవన్ బాలాజీపేట బహిరంగసభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని జనసేన నేతలకు సూచించామన్నారు. సభాస్థలిని వేరేచోటకు మార్చాలని సూచించారు. ఇప్పటి వరకు ఎవరిని గృహ నిర్భంధం చేయలేదని స్పష్టంచేశారు.