(Source: ECI/ABP News/ABP Majha)
Corona Update: తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ ఎక్కువగా పెరుగుతున్నాయి. మెున్నటి వరకు వందల్లో నమోదైన కేసులు.. ఇప్పుడు వేలకు చేరుకున్నాయి.
రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మెున్నటి వరకు వందల్లో నమోదైన కేసులు ఇప్పుడు వేలకు చేరుకుంటున్నాయి. కొత్తగా తెలంగాణలో 1,913 కొత్త కేసులు నమోదయ్యాయని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజులో 54,534 టెస్టులు నిర్వహించారు. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 232 మంది బాధితులు కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం తెలంగాణలో 7,847 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది. ఇప్పటివరకూ.. మెుత్తం రాష్ట్రంలో 6,87,456కు చేరుకున్నాయి. ఇందులో 6,75,573 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా తెలంగాణలో 4,036 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 0.58శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.27శాతంగా ఉంది.
దేశంలో పెరుగుతున్న కేసులు
దేశంలో కరోనా టాప్ గేర్‌లో వ్యాప్తి చెందుతోంది. కొత్తగా లక్షకు దగ్గరగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 90,928 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 56% పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 2,630కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 797కు చేరింది.
19,206 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. 325 మంది వైరస్‌తో మృతి చెందారు.
- డైలీ పాజిటివిటీ రేటు: 6.43%
- యాక్టివ్ కేసులు: 2,85,401
- మొత్తం రికవరీలు: 3,43,41,009
- మొత్తం మరణాలు: 4,82,876
- మొత్తం వ్యాక్సినేషన్: 148.67 కోట్ల డోసులు
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 26,538 మందికి కరోనా సోకింది. ఒక్క ముంబయిలోనే 15,166 కేసులు నమోదయ్యాయి. 8 మంది వైరస్‌తో మృతి చెందారు.
మంగళవారంతో పోలిస్తే మహారాష్ట్రలో కేసులు 43.71 శాతం పెరిగాయి.
Also Read: Corona Cases: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. తగ్గినట్టే కనిపించి ఎక్కువవుతున్న కేసులు
Also Read: Numaish Exhibition: కరోనా ఎఫెక్ట్.. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ రద్దు