అన్వేషించండి

Numaish Exhibition: కరోనా ఎఫెక్ట్.. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ రద్దు

ఈ ఏడాది నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ రద్దైంది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండంటో.. నాంపల్లి నుమాయిష్ పై కీలక నిర్ణయం తీసుకుంది ఎగ్జిబిషన్ సొసైటీ. ఈ ఏడాది నుమాయిష్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న కారణంగా.. తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ.. జీవీ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదట నుమాయిష్ 10 రోజులపాటు వాయిదా వేశారు. కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో.. పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.

ఇటీవలే ప్రశ్నించిన హైకోర్టు

కరోనా పరిస్థితుల్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ అవసరమా అని కొంతమంది ప్రశ్నించారు. కమిటీ సభ్యుల ఒత్తిడితో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే 2019 నుమాయిష్ ఎగ్జిబిషన్ లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ఇటీవలే విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేసింది. బయటకు వచ్చేందుకే.. ప్రజలు భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ అవసరమా అని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని తెలిపింది.

2019 నుమాయిష్​ ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదంపై హైకోర్టు విచారణ చేసింది. అయితే అప్పటి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిబిషన్​ నిర్వహణకు ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.  వాదనలు విన్న ధర్మాసనం.. 2019 అగ్నిప్రమాదంపై విచారణ ముగించినట్టు చెప్పింది. అనుమతులపై ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

ప్రస్తుతం.. ఎగ్జిబిషన్‌ నిలిపివేయడంపై సొసైటీ అభ్యంతరం వ్యక్తం చేసి.., ఎగ్జిబిషన్ నిలిపివేయడం సరికాదని సొసైటీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బయట థియేటర్లు, మాల్స్‌ కు జనాలు వెళ్తున్నారని..  వాటికి లేని ఆంక్షలు ఎగ్జిబిషన్‌కు ఎలా విధిస్తారంటూ వాదనలు వినిపించారు. 

సోసైటీ వాదనలపై హైకోర్టు.. ఘాటుగా స్పందించింది. ఓ వైపు.. కరోనా, ఒమిక్రాన్​ వంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారని..., ఈ సమయంలో ఎగ్జిబిషన్ కావాలా? అంటూ ప్రశ్నించింది. ఎగ్జిబిషన్ నిర్వహణపై ప్రభుత్వమే.. నిర్ణయం తీసుకుంటుందని.. అభిప్రాయపడింది. కరోనా పరిస్థితుల్లో.. ఎగ్జిబిషన్ పై.. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేసింది.

Also Read: Telangana High Court: ఓ వైపు బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా?

Also Read: Vanama Raghava Arrest: వనమా రాఘవ అరెస్టు.. కుమారుడిపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు లేఖ రాసిన కాసేపట్లోనే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget