Vanama Raghava Arrest: వనమా రాఘవ అరెస్టు.. కుమారుడిపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు లేఖ రాసిన కాసేపట్లోనే..

వనమా రాఘవను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కొత్తగూడెం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది.

FOLLOW US: 

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు.. కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. రాఘవేందర్ పై 302,306,307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి కుటుంబం ఆత్మహత్యకు సంబంధించిన వ్యవహారంలో.. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాఘవేంద్రరావును కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

అయితే బాధితుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొతగూడెం నియోజకవర్గ ప్రజలు లేఖ రాశారు. తనను పాల్వంచ ఘటన ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. తన కుమారుడిపై బాధిత కుటుంబం ఆరోపణలు చేసిందని.. పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. పోలీసులు విచారణ చేసేందుకు రాఘవను.. అప్పగిస్తామని కూడా చెప్పారు. ఎమ్మెల్యే స్పందించిన కొంత సమయంలోనే.. అతడి కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్టు చేశారు కొత్తగూడెం పోలీసులు. హైదరాబాద్ లో అరెస్టు చేసి.. ఆపై అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకొచ్చినట్టు సమాచారం. 

అసలు ఏమైందంటే..
కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఈ నెల 3వ తేదీన పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్య బలవన్మరణం చేసుకున్నారు. అయితే తాను చనిపోయేందుకు వనమా రాఘవేంద్రరావే కారణమని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీశారు. ఈ వీడియో ఎక్కువగా వైరల్ అయింది. ఇప్పటికే రామకృష్ణ సూసైడ్​ నోట్​, సెల్​ఫోన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారని.. తెలిసి.. రాఘవ అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం కూడా జరిగింది.

సెల్ఫీ వీడియోలో రామకృష్ణ ఏమన్నారంటే..

"కష్టాల్లో ఉన్న నాపై మా అక్క, అమ్మ కక్ష సాధిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోయిన నన్ను రోజూ వేధింపులకు గురి చేస్తున్నారు. దీనికి తోడు వనమా రాఘవరావు టార్చర్ మరింత ఎక్కువైంది. ఈ సమస్య తీరాలి అంటే నా భార్యను ఆయన పంపించాలన్నారు. అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. ఎవరి వద్ద చెప్పుకున్నా లాభం లేదన్నారు. చెప్పిన పని చేస్తేనే ఏం కావాలో అది చేస్తారట. రాజకీయ, ఆర్థిక బలుపుతో అవతలి వ్యక్తుల బలహీనతలను గ్రహించి ఆడుకుంటున్నాాడా వ్యక్తి. ఎన్నో కుటుంబాలు ఆయన వల్ల నాశనం అయిపోయాయి. ఈ చీకటి కోణాలకు సాక్ష్యాలు లేవు. ఓ వ్యక్తి సాయం చేయాలంటే తనకు లాభమేంటని చూసుకునే వ్యక్తి రాఘవ. నా సమస్యలో నా భార్యతో లబ్ధి పొందాలనుకున్నారు. వేరే దారి లేక నా భార్య బిడ్డలను రోడ్డున పడేయలేక సూసైడ్‌ నిర్ణయం తీసుకున్నాం. మా నాన్న ఇచ్చిన ఆస్తిలో కొంత భాగాన్ని నాకు సహకరించి అప్లులు ఇచ్చిన వారికి చెల్లించండి. మిగిలినది అమ్మ, అక్కకు వదిలేయండి. మరొకరికి అన్యాయం జరగకుండా చూడండి. "

Also Read: కొత్తగూడెం ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో మరో ట్విస్టు.. తన భార్యను ఎమ్మెల్యే కుమారుడు రమ్మన్నాడని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో

Also Read: Suryapet: సూర్యాపేటలో కిరాతక హత్య, బురదలో పడేసి.. ట్రాక్టర్ దమ్ము చక్రాలతో తొక్కించి..

Also Read: Pigeon News: భయపెడుతున్న పావురాలు.. కాలికి పసుపురంగు ట్యాగ్, దానిపై ఆ కోడ్ ఏంటి? అక్కడ కూడా ఇలాగే..

Published at : 06 Jan 2022 05:00 PM (IST) Tags: vanama venkateshwara rao family suicide Khammam News Vanama Raghavendra Arrest palvancha family suicide case Vanama Raghava Arrest Kotthagudem MLA Vanama Vanama Raghavendrarao

సంబంధిత కథనాలు

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో  తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్

Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత్

Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !

Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !

Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్

Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్

Telangana CM KCR చిల్లర బుద్దిని చూడలేకే ఆ నిధులపై కేంద్రం రూట్ మార్చింది: బండి సంజయ్

Telangana CM KCR చిల్లర బుద్దిని చూడలేకే ఆ నిధులపై కేంద్రం రూట్ మార్చింది: బండి సంజయ్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RCB Vs GT: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ - ప్లేఆఫ్స్‌కు చేరాలంటే బెంగళూరు కష్టపడాల్సిందే!

RCB Vs GT: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ - ప్లేఆఫ్స్‌కు చేరాలంటే బెంగళూరు కష్టపడాల్సిందే!

Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్‌పై స్టే

Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్‌పై స్టే

ASI Attacks Dhaba Staff: మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం - బిర్యానీ పెట్టలేదని హోటల్ సిబ్బందిపై బూతులు, దాడి

ASI Attacks Dhaba Staff: మద్యం మత్తులో ఏఎస్ఐ వీరంగం - బిర్యానీ పెట్టలేదని హోటల్ సిబ్బందిపై బూతులు, దాడి

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?

Bollywood: భార్యతో విడిపోతున్న మరో హీరో? 19 ఏళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్?