Xiaomi X Pro QLED: క్యూఎల్ఈడీ స్క్రీన్లతో టీవీలు దించనున్న షావోమీ - మార్కెట్లోకి వచ్చేవారమే!
Xiaomi New Smart TV: ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ షావోమీ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేయనుంది. ఇందులో 65 అంగుళాల టీవీల వరకు ఉండనున్నాయి. వీటిని కంపెనీ ఆగస్టు 27న మార్కెట్లోకి తీసుకురానుంది.
Xiaomi X Pro QLED Smart TV: షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ సిరీస్ మనదేశంలో త్వరలో లాంచ్ కానున్నాయి. ఈ లైనప్‌లో 65 అంగుళాల టీవీల వరకు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీల సిరీస్ లాంచ్ తేదీని కంపెనీ ఇప్పుడు ప్రకటించింది. దీని డిజైన్, ఫీచర్లను కూడా రివీల్ చేశారు. పేరులో తెలిపినట్లు ఇందులో క్యూఎల్ఈడీ ప్యానెల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ లైనప్‌లో ఆల్ స్క్రీన్ డిజైన్, చాలా సన్నని బెజెల్స్ ఉన్నాయి.
షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ టీవీ సిరీస్ ఇండియా లాంచ్ ఎప్పుడు?
షావోమీ ఇండియా మైక్రోసైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ 2024 స్మార్ట్ టీవీ సిరీస్ మనదేశంలో ఆగస్టు 27వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ లైనప్‌లో 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో టీవీలు ఉండనున్నాయి.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ టీవీ సిరీస్ ఫీచర్లు
షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీల్లో 43 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు వేర్వేరు డిస్‌ప్లే మోడళ్లు ఉన్నాయి. ఇందులో మ్యాజిక్ అనే ఫీచర్ అందించనున్నారు. దీని ద్వారా యూజర్లకు వైబ్రంట్ కలర్ ఎక్స్‌పీరియన్స్ లభించనుంది. షావోమీ మైక్రో సైట్‌లో తెలుపుతున్న దాని ప్రకారం చాలా సన్నని అంచులు, ఆల్ స్క్రీన్ డిజైన్‌తో ఈ టీవీలు రానున్నాయి. అలాగే వీటికి మెటల్ ఫినిషింగ్ అందించనున్నారు.
సినిమాటిక్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను ఈ టీవీలు అందిస్తాయని కంపెనీ అంటోంది. 2024 షావోమీ ఎక్స్ ప్రో క్యూఎల్ఈడీ టీవీలు ప్యాచ్ వాల్ ఇంటర్ ఫేస్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంలపై పని చేయనున్నాయి. అలాగే ఇందులో 32 జీబీ స్టోరేజ్ కూడా ఉండనుంది.
2023 షావోమీ ఎక్స్ ప్రో స్మార్ట్ టీవీలు మనదేశంలో గతేడాది ఏప్రిల్‌లో లాంచ్ అయ్యాయి. ఇందులో 40 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్లు ఉన్నాయి. 4కే హెచ్‌డీఆర్ స్క్రీన్లను ఈ టీవీల్లో అందించారు. మనదేశంలో వీటి ధర రూ.32,999 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో షావోమీ ప్యాచ్ వాల్ ఇంటర్ ఫేస్, డాల్బీ విజన్ ఐక్యూ, వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 టెక్నాలజీలను అందించారు.
మనదేశంలో స్మార్ట్ టీవీల సెగ్మెంట్‌లో షావోమీకి మంచి డిమాండే ఉంది. చవకైన ధరలో మంచి ఫీచర్లతో టీవీలను అందించడం వీరికి ప్లస్ పాయింట్. ప్రస్తుతం టీవీల విభాగంలో కూడా మనదేశంలో విపరీతమైన పోటీ పెరిగిపోయింది. షావోమీ, రియల్‌మీ, మోటొరోలా, నోకియా వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం ఈ విభాగంలో అడుగుపెట్టాయి.
Magic is about to come to life with #MagiQLED!
— Xiaomi TV India (@XiaomiTVIndia) August 19, 2024
Introducing the #XiaomiXProQLED Series—where extraordinary picture quality meets endless entertainment.
Launching on 27th August 2024, https://t.co/ZF9bepP8UZ pic.twitter.com/daZez4VxIk
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?