(Source: ECI/ABP News/ABP Majha)
Xiaomi 14 Ultra: లక్ష రూపాయల ఫోన్ లాంచ్ చేసిన షావోమీ - నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరాలతో!
Xiaomi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే షావోమీ 14 అల్ట్రా.
Xiaomi 14 Ultra Launched: షావోమీ 14 అల్ట్రా (Xiaomi 14 Ultra) స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మనదేశంలో లాంచ్ అయింది. షావోమీ 14 సిరీస్‌ను కంపెనీ ఇటీవలే మనదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. షావోమీ తన అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ఇటీవలే లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై షావోమీ 14 అల్ట్రా రన్ కానుంది.
షావోమీ 14 అల్ట్రా ధర (Xiaomi 14 Ultra Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,999గా నిర్ణయించారు. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. దీనికి సంబంధించిన రిజర్వ్ ఎడిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. రూ.9,999 చెల్లించి రిజర్వ్ చేసుకున్న వారికి ఏప్రిల్ 8వ తేదీ నుంచే ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ప్రీ-రిజర్వ్ మార్చి 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఏప్రిల్ 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు షావోమీ అధికారిక వెబ్‌సైట్, షావోమీ హోం అవుట్‌లెట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు రూ.5,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా లభించనుంది.
షావోమీ 14 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Xiaomi 14 Ultra Specifications)
ఇందులో 6.73 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ మైక్రో కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 3,200 x 1,440 పిక్సెల్స్ కాగా, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 3000 నిట్స్‌గా ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై షావోమీ 14 అల్ట్రా రన్ కానుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... దీని వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ900 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరో రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే మొత్తంగా నాలుగు 50 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారన్న మాట. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది. ఇది 90W వైర్డ్, 80W వైర్‌లెస్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. 5జీ, వైఫై, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదు, నావిక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఐపీ68 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?