Xiaomi 12 Series: ఒకే ఫోన్‌లో మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు - షియోమీ సూపర్ ఫోన్లు వచ్చేస్తున్నాయి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన 12 సిరీస్ ఫోన్లను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Xiaomi 12 Pro: షియోమీ 12 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో ఈ నెలలోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 15వ తేదీన ఇవి మార్కెట్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ప్లానెట్ కథనం ప్రకారం... షియోమీ 12 సిరీస్ ఫోన్లు మార్చి 15వ తేదీన యూరోప్‌లో లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో షియోమీ 12, షియోమీ 12 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి.
మార్చి 15వ తేదీన రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం మార్చి 16వ తేదీన తెల్లవారుజామున 1:30 గంటలకు) ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈ షియోమీ 12 సిరీస్ ఫోన్లు చైనాలో డిసెంబర్‌లోనే లాంచ్ అయ్యాయి.
షియోమీ 12 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై షియోమీ 12 పనిచేయనుంది. ఇందులో 6.28 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కంపెనీ అందించింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా షియోమీ 12లో అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై షియోమీ 12 స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... షియోమీ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండగా... 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో హెచ్‌డీఆర్, ఏఐ ఫీచర్లు కూడా అందించారు.
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 67W వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. దీని మందం 0.81 సెంటీమీటర్లుగానూ, బరువు 180 గ్రాములుగానూ ఉంది.
షియోమీ 12 ప్రో స్పెసిఫికేషన్లు
ఇది కూడా ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపైనే పనిచేయనుంది. ఇందులో 6.73 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ ఈ5 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు.
ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4600 ఎంఏహెచ్‌గా ఉంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 50W వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇక మిగతా కనెక్టివిటీ ఫీచర్లన్నీ షియోమీ 12 ప్రో తరహాలో ఉంది. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!