అన్వేషించండి

Xiaomi 11i Hypercharge 5G: షియోమీ కొత్త ఫోన్ల సేల్ నేడే.. కొత్త సంవత్సరం ఫోన్ కొనాలనుకుంటే బెస్ట్ ఛాయిస్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో షియోమీ 11ఐ 5జీ సిరీస్ ఫోన్లు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వీటి సేల్ మనదేశంలో ఈరోజు జరగనుంది.

షియోమీ 11ఐ హైపర్‌చార్జ్ 5జీ, షియోమీ 11ఐ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇటీవలే మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. వీటి సేల్ మనదేశంలో ఈరోజు ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. షియోమీ 11ఐ హైపర్ చార్జ్ 5జీ మనదేశంలో అత్యంత వేగంగా చార్జ్ అయ్యే ఫోన్. కేవలం 15 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుంది. ఇందులో ఏకంగా 120W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అందించారు.

షియోమీ 11ఐ హైపర్‌చార్జ్ 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా నిర్ణయించారు.

షియోమీ 11ఐ 5జీ ధర
ఇక షియోమీ 11ఐ 5జీలో కూడా రెండు వేరియంట్లే లాంచ్ అయ్యాయి. ఈ వేరియంట్లలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.24,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.28,999గానూ నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ జనవరి 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది.

షియోమీ 11ఐ హైపర్ చార్జ్ 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను షియోమీ అందించింది. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గానూ ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను షియోమీ 11ఐ హైపర్ చార్జ్ 5జీలో అందించారు. ఇక స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా కూడా పెంచుకునే అవకాశం ఉంది. 

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఎన్‌హేన్స్‌డ్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. 

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్‌ను అందించారు. ఇక దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో అందించారు.

మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో రెండు స్పీకర్లు అందించారు. డాల్బీ అట్మాస్, హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. షియోమీ 11ఐ హైపర్ చార్జ్ 5జీ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 15 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానున్నట్లు కంపెనీ తెలిపింది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 204 గ్రాములుగా ఉంది.

షియోమీ 11ఐ 5జీ స్పెసిఫికేషన్లు
ఈ మొబైల్ ఫీచర్లు పూర్తిగా షియోమీ 11ఐ హైపర్ చార్జ్ తరహాలోనే ఉన్నాయి. షియోమీ 11ఐ 5జీలో 5160 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని బరువు 207 గ్రాములుగా ఉంది.

Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Xiaomi 11i Hypercharge 5G: షియోమీ కొత్త ఫోన్ల సేల్ నేడే.. కొత్త సంవత్సరం ఫోన్ కొనాలనుకుంటే బెస్ట్ ఛాయిస్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
Vaa Vaathiyaar Release Date : సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణ ప్రజలకు చలి నుంచి రిలీఫ్
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Virat Kohli Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న 5 రికార్డులు ఇవే
Vaa Vaathiyaar Release Date : సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
iPhone Fold Phone: మడతపెట్టే ఐఫోన్.. భారతదేశంలో ధర ఎంత ? ఎప్పుడు లాంచ్ అవుతుంది
మడతపెట్టే ఐఫోన్.. భారతదేశంలో ధర ఎంత ? ఎప్పుడు లాంచ్ అవుతుంది
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
MI vs DC Highlights: కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
Embed widget