Xbox Series S Price Increase: గేమింగ్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్ - వాటి రేట్లు మామూలుగా పెరగట్లేదుగా!
ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ ధర మనదేశంలో రూ.34,999 నుంచి రూ.36,999కు పెరగనుందని తెలుస్తోంది.
మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ సిరీస్‌లో ఎక్స్, ఎస్ కన్సోల్స్‌ను రెండు సంవత్సరాల క్రితం లాంచ్ చేసింది. అప్పటినుంచి వీటిపై చాలా హైప్ వచ్చింది. ఇప్పుడు వీటిలో ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ ధర మనదేశంలో మరింత పెరగనుందని తెలుస్తోంది. అయినా ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్‌కు ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎస్ చవకైన ప్రత్యామ్నాయంగానే ఉండనుంది.
ఎక్స్ బాక్స్ సిరీస్ ఎస్ మనదేశంలో రూ.34,990 ధరతో లాంచ్ అయింది. జూన్ 30వ తేదీ నుంచి దీని ధర రూ.36,990కు పెరగనుంది. దీంతోపాటు ఈ ఫోన్ గేమ్ కంట్రోలర్ ధర కూడా రూ.5,390 నుంచి రూ.5,590కు పెరగనుంది. అలాగే రూ.8,990గా ఉన్న హెడ్ సెట్ ధర రూ.9,490 కానుంది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వేగంగా పడటమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ప్లేస్టేషన్ 5 ధరలు కూడా అలాగే ఉంటాయో లేకపోతే పెరుగుతాయో తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి కచ్చితంగా పెరిగేలాగానే ఉంది.
గత రెండు సంవత్సరాల్లో ఎన్నో థర్డ్ పార్టీ యాక్సెసరీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిలో బెన్‌క్యూ మొబియజ్ ఈఎక్స్3210యూ 4కే గేమింగ్ మానిటర్ ముఖ్యమైనది. ఇది మనదేశంలో కూడా లాంచ్ అయింది. దీని ధరను రూ.87,500గా నిర్ణయించారు. ఎక్స్‌బాక్స్ లేదా ప్లేస్టేషన్‌లకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు.
ఈ గేమింగ్ మానిటర్‌లో 32 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. కంప్యూటర్‌కు కనెక్ట్ చేసినప్పుడు దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉండగా... గేమింగ్ కన్సోల్‌కు కనెక్ట్ చేసినప్పుడు 120 హెర్ట్జ్‌గా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram