అన్వేషించండి

Whatsapp New Feature: వాట్సాప్ నుంచి ఏ యాప్‌కైనా మెసేజింగ్ - అందుబాటులోకి తీసుకురానున్న కంపెనీ!

Whatsapp Feature: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వాట్సాప్ నుంచి ఏ యాప్‌కు అయినా మెసేజ్ చేసే అవకాశం లభించనుంది.

WhatsApp Upcoming Feature: వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. తద్వారా యాప్ యూజర్లకు వినియోగం మరింత సులభం అవుతుంది. అందుకే వాట్సాప్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌గా నిలిచింది. ఇప్పుడు వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌పై పని చేస్తోంది. దీని ద్వారా వినియోగదారులు వాట్సాప్ నుంచి థర్డ్ పార్టీ యాప్‌లతో ఛాట్ చేయగలుగుతారు. వాస్తవానికి మెటా తీసుకువచ్చిన ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ థర్డ్ పార్టీ యాప్‌లతో ఛాటింగ్ ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత యూజర్లు వాట్సాప్ నుండే ఏదైనా ఇతర యాప్‌కి మెసేజ్‌లు పంపగలరు.

యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ చట్టం తీసుకొచ్చిన ఒత్తిడితో ఈ ఫీచర్‌ను మార్చి నాటికే అందుబాటులోకి తీసుకురావచ్చని సోషల్ మీడియాలో ఒక వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ ఇంజనీరింగ్ డైరెక్టర్ డిక్ బ్రోబర్ వాట్సాప్ తన 200 కోట్ల మంది వినియోగదారులకు థర్డ్ పార్టీ యాప్‌లతో ఛాటింగ్ చేసే సదుపాయాన్ని అందించడానికి ఇంటర్‌ఆపరబిలిటీని అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. వాట్సాప్ ప్రైవసీ, సెక్యూరిటీ, యూనిటీని దృష్టిలో ఉంచుకుని థర్డ్ పార్టీ యాప్‌లకు ఇంటర్‌ఆపరబిలిటీని అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.

టెలిగ్రామ్ సపోర్ట్ చేస్తుందా లేదా?
వాట్సాప్ అతిపెద్ద ప్రత్యర్థి టెలిగ్రామ్... ఈ ఇంటర్‌ఆపరబిలిటీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందో లేదో ఇంకా ఖచ్చితమైన సమాచారం అందలేదు. వాట్సాప్‌కు టెలిగ్రామ్ మొదటి నుంచి గట్టి పోటీని ఇస్తుందని, ఈ యాప్‌లో వినియోగదారులు వాట్సాప్‌లో అందుబాటులో లేని కొన్ని ఫీచర్‌లను పొందుతారు. అటువంటి పరిస్థితిలో టెలిగ్రామ్, వాట్సాప్ వినియోగదారులు ఒకరి యాప్‌ల ద్వారా ఒకరితో ఒకరు చాటింగ్ చేయడం ప్రారంభిస్తే అది నిజంగా అద్భుతమైన ఫీచర్ అవుతుంది.

అయితే మెటా తన ఇతర ఛాటింగ్ ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌బుక్ మెసెంజర్, ఇతర ఛాటింగ్ యాప్‌లకు మద్దతుని ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత వినియోగదారులు టెక్స్ట్ మెసేజింగ్, ఫోటోలు పంపడం, వాయిస్ మెసేజ్‌లు పంపడం, వీడియోలను పంపడం, ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం వంటి ఫీచర్లను ఉపయోగించగలరు. ప్రస్తుతం ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ వినియోగదారులు... ఇతర యాప్‌ల యూజర్లతో గ్రూప్ ఛాట్ లేదా కాల్ చేయలేరు. దీన్ని తర్వాత యాడ్ చేయనున్నారు.

వాట్సాప్ గత ఏడాది తన నిబంధనలను కూడా మార్చింది. యూజర్లు గూగుల్ అకౌంట్‌లో ఉచితంగా చేసుకునే చాట్ బ్యాకప్‌ను త్వరలో కౌంట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మీరు వాట్సాప్ బ్యాకప్ చేసినప్పుడు గూగుల్ ఖాతాలో సేవ్ అవుతుంది కదా. అది ఇప్పటివరకు ఎంత డేటా అయినా కూడా ఉచితంగా అయ్యేదన్న మాట. అయితే ఇకపై మీకు గూగుల్ ఖాతాలో లభించే 15 జీబీ డేటాలోనే వాట్సాప్ బ్యాకప్ కూడా కౌంట్ అవుతుందన్న మాట. అక్కడ స్టోరేజ్ తక్కువగా ఉంటే మీరు అదనపు స్టోరేజ్ కోసం చెల్లించాల్సి ఉంటుందన్న మాట. అసలు ఈ గొడవే వద్దు అనుకుంటే చాట్ బ్యాకప్‌ను పూర్తిగా ఆఫ్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. ఈ అప్‌డేట్ ఈ ఏడాది జులై నాటికి అందరికీ అమలు కానుందని తెలుస్తోంది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget