WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్ లో పంపే డాక్యుమెంట్స్ కు క్యాప్షన్ పెట్టుకునే అవకాశాన్ని ఎనేబుల్ చేసింది.
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చే వాట్సాప్.. మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ చాట్ లో పంపే డాక్యుమెంట్స్ కు క్యాప్షన్ పెట్టే అవకాశాన్ని కల్పిస్తోంది. వాట్సాప్ అప్‌డేట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ WaBetaInfo ఈ సరికొత్త ఫీచర్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. యాప్‌లోని సెర్చ్ ఆప్షన్ ని ఉపయోగించి చాట్‌లలో షేర్ చేసిన డాక్యుమెంట్‌లను సులభంగా కనుగొనే అవకాశం ఉంటుదని ఈ సందర్భంగా వెల్లడించింది.
కొంత మంది బీటా టెస్టర్లకే ఈ అవకాశం
WhatsApp ప్రస్తుతం తన ప్లాట్ ఫామ్ లో భాగస్వామ్యం చేయబడిన ఫోటోలు, వీడియోలు, GIFల కోసం మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. తాజాగా విడుదలైన ఫీచర్ ద్వారా చాట్ లో షేర్ చేసే డాక్యుమెంట్లకు క్యాప్షన్ రాసే అవకాశం ఉంటుంది. వాట్సాప్ కొంతమంది బీటా టెస్టర్ల కోసం క్యాప్షన్ తో డాక్యుమెంట్‌లను షేర్ చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త అప్ డేట్ యూజర్‌లు క్యాప్షన్‌తో డాక్యుమెంట్‌లను షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు ‘క్యాప్షన్ బార్’ ద్వారా డాక్యుమెంట్ కు క్యాప్షన్ రాసే అవకాశం ఉంటుంది. ఈ అప్‌డేట్ Google Play బీటా ప్రోగ్రామ్ ద్వారా రూపొందించబడింది. దీని వెర్షన్ 2.22.22.7 వరకు అందుబాటులోకి వచ్చింది. WaBetaInfo వెబ్‌సైట్ 'డాక్యుమెంట్ క్యాప్షన్' ఫీచర్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది.
మరికొద్ది రోజుల్లో అందరికీ అందుబాటులోకి!
WABetaInfo ప్రకారం.. వినియోగదారులు డాక్యుమెంట్ ను ఎంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు క్యాప్షన్ బార్ పాప్ అప్ అవుతుంది. అప్పుడు క్యాప్షన్ రాసి పంపించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మళ్లీ ఆ డాక్యుమెంట్ అవసరం ఉన్నప్పుడు క్యాప్షన్ ద్వారా సెర్చ్ చేస్తే ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం కొంత మందికే అందుబాటులోకి రాగా.. మరికొద్ది వారాల్లో మరింత మంది బీటా వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశం ఉంది
📝 WhatsApp beta for Android 2.22.22.7: what's new?
— WABetaInfo (@WABetaInfo) October 6, 2022
WhatsApp is releasing the ability to share documents with a caption for some beta testers.https://t.co/gLmHeRU57Y
అందుబాటులోకి ఆప్షనల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్, ’స్క్రీన్షాట్ బ్లాకింగ్’ ఫీచర్
వాట్సాప్ తాజాగా బిజినెస్ అకౌంట్స్ కోసం ఆప్షనల్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కూడా విడుదల చేసింది. 'WhatsApp ప్రీమియం'తో వ్యాపారులు కస్టమర్లును ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. Android, iOS యాప్ తాజా బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే నిర్దిష్ట బిజినెసెస్ కోసం 'సబ్‌స్క్రిప్షన్ ప్లాన్' ఫీచర్ విడుదల చేయబడింది. త్వరలో ఈ ఫీచర్ మరిన్ని బిజినెస్ అకౌంట్స్ కు అందుబాటులోకి తీసుకురాబడుతుంది. అటు ఈ వారం కొన్ని iOS బీటా టెస్టర్‌లకు ’స్క్రీన్‌షాట్ బ్లాకింగ్’ ఫీచర్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఫీచర్ వినియోగదారుల ఫోటోలను, వీడియోలను ఇష్టం వచ్చినట్లు స్క్రీన్ షాట్ తీసుకోకుండా నిరోధిస్తుంది.