WhatsAppలో మరో 3 కొత్త ఫీచర్లు.. మీకు పనికొస్తాయేమో చెక్ చేసుకోండి
WhatsApp Lates News: వినియోగదారులు ఇప్పుడు WhatsAppలో వీడియో కాల్స్‌కు సంబంధించి మూడు కొత్త ఫీచర్లను గమనిస్తారు. వీడియో కాల్స్ చేసే వారికి ఈ ఫీచర్లతో ప్రయోజనం కలుగుతుంది.
WhatsApp Features | ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు మన జీవితాల్లో భాగంగా మారింది. మెటా యాజమాన్యంలోని ఈ యాప్ ద్వారా మెస్సేజ్, వీడియో కాల్స్ చేయవచ్చు. ఫొటోలు, వీడియోలు సైతం తమ వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్లకు పంపవచ్చు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా కాల్స్ చేయడానికి కంపెనీ మూడు కొత్త ఫీచర్లను విడుదల చేసింది. ఈ ఫీచర్లు వ్యక్తిగత కాల్స్‌తో పాటు వీడియో కాల్ మీటింగ్‌లను సులభతరం చేయనున్నాయి. ఈ ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయని సంస్థ తెలిపింది. క్రమంగా అందరు వినియోగదారులకు లేటెస్ట్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.
వాట్సాప్‌లో ఈ మూడు కొత్త ఫీచర్లు
షెడ్యూల్డ్ కాల్స్ - ఇప్పుడు వాట్సాప్ వినియోగదారులు యాప్ నుంచి గ్రూప్ కాల్స్‌ను షెడ్యూల్ చేయవచ్చు. అంటే వినియోగదారుడు తన కాంటాక్ట్‌లలో ఎవరికైనా లేదా మొత్తం గ్రూప్‌కు వీడియో కాల్ చేయడానికిగానూ ముందుగానే నోటిఫికేషన్ పంపవచ్చు.
ఇన్-కాల్ ఇంటరాక్షన్ టూల్స్ - రెండవ కొత్త ఫీచర్ ఇన్-కాల్ ఇంటరాక్షన్. ఇప్పుడు వాట్సాప్ వినియోగదారులు వీడియో కాల్స్ సమయంలో రియాక్షన్ ఇవ్వవచ్చు. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు మాట్లాడాలనుకుంటే, అతను వీడియో కాల్ సమయంలో తన చేతిని పైకెత్తి సూచించవచ్చు. దాంతో ఆ యూజర్ సంభాషణకు అంతరాయం కలిగించకుండా కాల్ మధ్యలోనే తన స్పందనను తెలపవచ్చు.
కొత్త కాల్ నిర్వహణ- ఈ రెండు ఫీచర్లతో పాటు వాట్సాప్ సంస్థ కాల్స్ ట్యాబ్‌ను కూడా మాడిఫై చేసింది. ఇప్పుడు దీనికి రాబోయే కాల్స్, కాల్‌కు హాజరయ్యే వ్యక్తుల జాబితా, షేర్ చేయగల కాల్ లింక్‌ల గురించి స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో పాటు, షేర్డ్ లింక్ నుండి ఎవరైనా కాల్‌కు హాజరైనట్లయితే, కాలర్‌కు దానికి సంబంధించి నోటిఫికేషన్ సైతం వస్తుంది.
ఇతర టూల్స్, యాప్స్‌తో పోటీకి సై
వ్యక్తిగత, గ్రూప్ వీడియో కాల్‌లకు సంబంధించిన ఈ ముఖ్యమైన ఫీచర్‌లను తీసుకురావడానికి వాట్సాప్ సన్నద్ధమైంది. ఈ ఫీచర్లతో, గూగుల్ మీట్, జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి ఇతర వీడియో కాల్ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడతామని వాట్సాప్ సంస్థ మెటా భావిస్తోంది. ఈ ఫీచర్ల రాకతో, వాట్సాప్ ఇప్పుడు వ్యక్తిగత, గ్రూప్ కాల్స్‌తో పాటు ఆన్‌లైన్ క్లాసులు, ఆన్‌లైన్ మీటింగ్స్ కోసం యూజర్ల ఫస్ట్ ఛాయిస్‌గా మారుతుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.























