అన్వేషించండి

మీ WhatsApp మెస్సేజ్‌లను సీక్రెట్‌గా ఎవరైనా చదువుతున్నారా? వెంటనే ఈ 5 పనులు చేయండి

WhatsApp Tips: వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా డేటా ప్రైవసీ ఉంటుంది. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే మీ వాట్సాప్ డేటా లీక్ అవకుండా జాగ్రత్త పడిన వారు అవుతారు.

Whatsapp Tips: నేటి డిజిటల్ ప్రపంచంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. వాట్సాప్ తన వినియోగదారులను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ తో వ్యక్తిగత గోప్యత వంటి లక్షణాలతో మీ డేటా లీక్ కాకుండా చూస్తుందని మెటా సంస్థ చెబుతోంది. కానీ వాస్తవానికి జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉండవచ్చు. మీరు రాత్రిపూట మీ స్నేహితుడితో చాట్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా కొన్ని మెస్సేజ్‌లు చదవకుండానే మీరు "Read" చేసినట్లుగాగా కనిపించినట్లు ఎప్పుడైనా గుర్తించారా.  లేదా మూడవ వ్యక్తి కూడా కాల్ సమయంలో వాయిస్ వింటున్నట్లుగా శబ్దాలు వచ్చే చాన్స్ ఉంది. ఈ విషయాలు చదువుతుంటే కొందరు వాట్సాప్ వినియోగదారులకు ఇది కొత్తగా అనిపిస్తుంటే.. మరికొందరికీ ఇది తమకు జరిగింది అని అనిపిస్తుంది. 

వాట్సాప్ సురక్షితమేనా? (Is WhatsApp safe?)
వాట్సాప్‌నకు నున్న బలమైన భద్రతా వ్యవస్థ దానిని సాధారణ హ్యాకింగ్ నుండి రక్షిస్తుంది. కానీ ఇది 100 శాతం మీకు డేటా ప్రైవసీ ఇస్తుందని మాత్రం కాదు.  ఎవరైనా మీ ఫోన్‌ యాక్సెస్ పొందితే లేదా మీ వాట్సాప్ QR కోడ్‌ను స్కాన్ చేసినా సమయంలో లేదా స్పైవేర్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే కనుక మీ వాట్సాప్ చాట్‌ మెస్సేజ్‌లతో పాటు మీ వాట్సాప్ కాల్‌ల వివరాలు ప్రమాదంలో పడవచ్చు.

మనం ఫేక్ లింక్‌లపై క్లిక్ చేసినప్పుడు లేదా మన మొబైల్ సేఫ్టీని ఈజీగా తీసుకున్నప్పుడు తరచుగా ఇలాంటి గూఢచర్య కేసులు (Data Privacy Cases) జరుగుతాయి. కనుక మీ ఫోన్, యాప్ గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. 

ఎవరైనా మీ వాట్సాప్‌పై గూఢచర్యం చేస్తున్నారో లేదో తెలుసుకోండి
మీరు మెస్సేజ్‌లను ఓపెన్ చేయకపోయినా ఆ మెస్సేజ్ చదివినట్లుగా కనిపిస్తే, మీ వాట్సాప్ అకౌంట్‌లోకి  మరొకరు లాగిన్ అయ్యారని సిగ్నల్ కావచ్చు. ఫోన్ అకస్మాత్తుగా వేడెక్కినా లేదా బ్యాటరీ వేగంగా అయిపోతే అది దాగి ఉన్న స్పైవేర్ వల్ల కావచ్చు. ఏదైనా తెలియని డివైజ్‌లో WhatsApp వెబ్‌లోకి లాగిన్ అయి ఉంటే, వెంటనే లాగౌట్ కావాలి. తెలియని నంబర్‌ల నుండి వింత లింక్‌లు లేదా మెస్సేజ్‌లు రిసీవ్ చేసుకోవడం, లేదా కాల్‌లలో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ లాంటివి వస్తే మీపై నిఘా పెట్టారని, మీ డేటాను చోరీ చేస్తున్నారని తెలిపే సంకేతాలు కావచ్చు.

WhatsApp స్పై చేయకుండా 5 సులభమైన  మార్గాలు

రెండు-దశల వెరిఫికేషన్ ఆన్ చేయండి
మీరు WhatsApp సెట్టింగ్‌లకు వెళ్లి ఖాతా > రెండు-దశల ధృవీకరణ (2 Step verification)కు వెళ్లి దానిని ఆన్ చేయండి. ఇది మీ వాట్సాప్ ఖాతాను ఇతరులు సులభంగా యాక్సెస్ చేయకుండా నిరోధిస్తుంది.

లింక్ అయిన డివైజ్‌ల నుంచి లాగ్ అవుట్ చేయండి
వాట్సాప్ లో సెట్టింగ్‌లు > లింక్ చేయబడిన (Link Devices) పరికరాలకు వెళ్లి మీకు తెలియని డివైజ్ కనిపిస్తే వెంటనే లాగౌట్ చేయాలి. 

మరీ అనుమానం ఉంటే మొబైల్ నంబర్‌ను మార్చండి
మీ సిమ్ లేదా మొబైల్ ట్యాంపర్ అయిందని మీరు భావిస్తే కనుక మొదట సిమ్ కార్డును మార్చేసి కొత్తన నెంబర్ తీసుకోవడం మంచిది.

లొకేషన్ షేరింగ్‌ను ఆఫ్ చేయాలి
మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఎవరైనా మీ కదలికలను  ట్రాక్ చేస్తున్నారని అనుమానం కలిగితే కనుక  Settings > Privacy > స్థానానికి వెళ్లి లొకేషన్ షేరింగ్‌ను ఆఫ్ చేయడం బెటర్

మీ ఫోన్‌ను, యాప్‌లను అప్‌డేట్‌గా ఉంచండి
WhatsApp యాప్‌తో పాటు మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌గా ఉంచడం ద్వారా కొన్ని రకాల భద్రతా పరిష్కారం లభిస్తుంది. కనుక వాటిని తాజా వెర్షన్‌లో ఉంచాలి

యాంటీ స్పైవేర్ యాప్‌లను వాడాలి
Norton, Bitdefender లేదా Malwarebytes వంటి యాంటీ స్పైవేర్ యాప్‌లు మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే స్పైవేర్‌ను గుర్తించి వాటిని తొలగిస్తాయి. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget