WhatsApp కొత్త ఫీచర్! ఒక్క క్లిక్‌తో ఎవరు ఏమి పోస్టు చేశారో తెలిసిపోతుంది! ఇంతకీ అది ఎలా పని చేస్తుందో తెలుసుకోండి!
WhatsApp లో Meta కొత్త AI ఫీచర్లు తీసుకొస్తోంది. 'Quick Recap' వంటివి తీసుకురానుంది. యూజర్లకు మరింత ఫ్రెండ్లీ సర్వీస్ అందించేందుకు ప్రయత్నిస్తోంది.

WhatsApp Quick Recap: Meta ఇప్పుడు WhatsAppలో అనేక కొత్త AI ఫీచర్లు తీసుకురావడానికి సిద్ధమవుతోంది, వాటిలో అత్యంత ఆసక్తికరమైనది 'Quick Recap' అనే కొత్త ఫీచర్. వాట్సాప్‌లో రోజుకు మీకు వందల మెసేజ్‌లు వస్తుంటాయి. అందులో మీరు చదివేవి చాలా తక్కువే ఉంటాయి. చదవకుండా వదిలేసిన మెసేజ్‌లలో ఏదైనా ముఖ్యమైనది వదిలేశామేమో అన్న అనుమానం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ఫీచర్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు చాలా చదవని చాట్‌ల సారాంశాన్ని సులభంగా పొందగలరు. WABetaInfo నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. WhatsApp Android బీటా వెర్షన్ 2.25.21.12లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
ఇది ఎలా పని చేస్తుంది?
Quick Recap ఫీచర్ WhatsApp ఇప్పటికే ఉన్న మెసేజ్ సమ్మరీ సిస్టమ్ అధునాతన రూపం. ఇది ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఒక చాట్ చిన్న వివరణను అందిస్తుంది. కానీ కొత్త ఫీచర్ దీనికంటే చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉందని చెబుతున్నారు. ఇందులో వినియోగదారులు ఒకేసారి ఐదు చాట్‌లను ఎంచుకోగలరు. AI సహాయంతో ప్రతి చాట్‌లో ఉన్న ముఖ్యాంశాలను క్విక్‌గా పొందగలరు.
ఈ ఫీచర్ ముఖ్యంగా ఎక్కువ కాలం యాప్ వాడకుండా ఉంటూ పాత చాట్‌లను మళ్లీ మళ్లీ స్క్రోల్ చేయవలసి వచ్చే టైంలో యూజ్ అవుతాయి. అలాంటి వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు సమయం వృథా చేయకుండా, ప్రతి చాట్ సారాంశం క్విక్‌గా మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఈ ఫీచర్ ఎలా లభిస్తుంది
WABetaInfo షేర్ చేసిన సమాచారం ప్రకారం, వినియోగదారులు దీన్ని యాక్సెస్ చేయడానికి చాట్స్ ట్యాబ్‌కి వెళ్లి కావాల్సిన చాట్‌లను ఎంచుకోవాలి. ఆపై కుడివైపున దిగువన కార్నర్‌లో ఉన్న మూడు చుక్కల మెనూలో 'Quick Recap' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కిన వెంటనే, Meta అంతర్గత AI ఆ సందేశాలను చదువుతుంది. ఆ మెసేజ్‌లను ప్రాసెస్ చేసి, వాటి స్పష్టమైన సారాంశాన్ని అందిస్తుంది.
మీ ప్రైవసీ సురక్షితంగా ఉంటుందా?
Meta ఈ ఫీచర్ దాని 'Private Processing' సాంకేతికతతో పని చేస్తుందని పేర్కొంది. ఇది వినియోగదారు గోప్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, సురక్షిత ఎన్‌క్లేవ్, వేర్వేరు కంప్యూటింగ్ ఏరియాలను ఉపయోగిస్తుంది. దీని వలన Meta లేదా WhatsApp అసలు సందేశాలు చూడలేవు. AI ద్వారా రివ్యూ చేసే సారాంశాన్ని కూడా చదివే వీలు లేదు.
ఇది ఆప్షనల్ ఫీచర్
ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్ ఉంటుంది. అంటే, వినియోగదారుడు దీన్ని మాన్యువల్‌గా సెట్టింగ్‌లకు వెళ్లి ఆన్ చేయాలి. ఇది డిఫాల్ట్‌గా ఆన్ చేసి ఉండదు. అదనంగా, WhatsApp 'Advanced Chat Privacy'తో సురక్షితమైన చాట్‌లు ఇందులో చేర్చరు.
త్వరలో అందరికీ అందుబాటులోకి
ప్రస్తుతం, Quick Recap WhatsApp Android బీటా వినియోగదారుల కోసం మాత్రమే పరీక్ష రూపంలో అందుబాటులో ఉంది. రాబోయే కొన్ని వారాల్లో ఈ ఫీచర్ బీటా టెస్టర్‌ల కోసం విడుదల చేసింది. తరువాత అన్ని Android వినియోగదారులకు చేరుతుందని భావిస్తున్నారు. WhatsApp ఈ కొత్త అప్‌డేట్ వందలాది మెస్జేజ్‌లు అందుకే వాటిని చదవలేక ఇబ్బంది పడుతున్న వారికి ఉపయోగపడుతుంది. సమయాన్ని కూడా ఆదా చేయనుంది.





















