అన్వేషించండి

Whatsapp: వాట్సాప్ నుంచి మూడు సరికొత్త ఫీచర్లు.. ఇకపై ఫోటోలు, వాయిస్ తో మాట్లాడొచ్చు

వాట్సప్‌ 3 సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఏఐ సంభాషణల్ని మరింత మెరుగుపరిచేలా రియల్‌ టైమ్‌ కన్వర్జేషన్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది.  మెటా ఏఐలో ఫొటోలను ఎడిట్​ చేసి పంపేలా ఫీచర్లను సైతం జోడించింది.

Whatsapp New Features: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టెక్​ యుగంలో దూసుకెళ్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ముందుకొస్తూ యూజర్లను ఆకర్షిస్తోంది. ఇప్పటికే తమకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో మెటా ఏఐ పేరుతో సేవలను అందిస్తోంది. 

తాజాగా ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌లోనూ మూడు సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఏఐ సంభాషణల్ని(చాట్​బాట్​) మరింత మెరుగుపరిచేలా రియల్‌ టైమ్‌ కన్వర్జేషన్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది.  దీంతో పాటే మెటా ఏఐలో ఫొటోలను నచ్చినట్లుగా ఎడిట్​ చేసి పంపేలా ఫీచర్లను జోడించింది. దీని ద్వారా యూజర్స్​ తమ ఐడీయాస్​ను మరింత​ ఎక్స్​ప్లోర్​ చేసి తమ చాట్స్​ను మరింత మెరుగుపరిచేలా, కొత్త విషయాలను చెప్పేలా ఉంటుందని సదరు మాతృ సంస్థ తెలిపింది.  మరి ఇంతకీ మెటా తీసుకొచ్చిన ఆ మూడు ఫీచర్లు ఏంటి? వాటి వల్ల ఉపయోగం ఏంటి? విశేషాలను తెలుసుకుందాం. 

1.టాక్​ టు మి ఫీచర్​(రియల్‌ టైమ్‌ సంభాషణలు)
మెటా ఏఐతో మన సొంత వాయిస్‌తోనే రియల్‌ టైమ్‌ సంభాషణలు చేయొచ్చు.  ఏవైనా ప్రశ్నలు అడిగితే దానికి సంబంధిత విషయం గురించి స్పష్టంగా వివరించడం దీని ప్రత్యేకత. మూడ్‌కు తగ్గట్లు జోక్స్​ను కూడా వేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌  అత్యంత వేగంగా సమాధానాలు ఇస్తుంది. 

ఇంకా మెటా ఏఐ వాయిస్‌ను కూడా మార్చుకునే అవకాశం ఇందులో ఉంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.  అక్వాఫినా, డేమ్ జుడి డెంచ్​, క్రిస్టెన్ బెల్, కీగన్-మైఖేల్ కీ జాన్ సెనా  వంటి ప్రముఖ వ్యక్తుల వాయిస్‌ను కూడా సెట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. 

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

2. లుక్​ యట్​ దిస్​(ఫొటోతో ప్రశ్నలు వేయొచ్చు)
సాధారణంగా  ఏదైనా సందేహం వస్తే మెటా ఏఐ చాట్​ను క్లిక్ చేసి టెక్ట్స్​ టైప్ చేసి అడుగుతాం. లేదంటే వాయిస్ కమాండ్ పంపిస్తాం.  అయితే కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫీచర్​తో ఫొటోతోను సమాధానం చెప్తుంది.  ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో మనకు తెలియని భాషలో పదాలు ఉండొచ్చు, లేదంటే ఫొటో ఉండొచ్చు.  అలాంటి సందర్భాల్లో ఆ పదాలు లేదా ఫొటోను పంపించి దాని అర్థం ఏంటని అడిగితే, వెంటనే దానికి సంబంధించిన  పూర్తి సమాచారాన్ని ఇట్టే అందిస్తుంది.

3. ఎడిట్ మై ఫొటో (ఫొటోస్ ఎడిట్ సదుపాయం)
పైన ఉన్న రెండు ఫీచర్లు ఫ్రీ వెర్షన్​ చాట్​జీపీటిలోనూ అందుబాటులో ఉంటాయి. అయితే మెటా తీసుకొచ్చిన కొత్త ఫీచర్లలో ఫొటోలను ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. దీనివల్ల వాట్సాప్​ యూజర్స్​ కేవలం ఫొటోలను షేర్​ చేసుకోవడే కాదు ఎడిట్​ కూడా చేసుకోవచ్చు.  ఈ ఫీచర్​తో చాట్​ బాట్​కు ఫొటోలను ఎడిట్‌ చేసి మనకు నచ్చినట్లుగా మార్చమని చెప్పొచ్చు. 
మనం ఏదైనా ఫొటోను పంపి అందులోని కలర్స్, లేదా ఇంకేమైనా మార్చమని కమాండ్ ఇస్తే  అది వెంటనే మార్చి పంపుతుంది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లోని వ్యక్తులను తొలగించాలన్నా క్లియర్ చేసి సెండ్ చేస్తుంది. ఈ ఫీచర్ వల్ల ఇకపై ఫొటో ఎడిటింగ్ కోసం ఇతర ప్లాట్​ఫామ్స్​ను వినియోగించాల్సిన అవసరం ఉండదు.  ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ రోలవుట్‌ అవుతోంది. ​దశలో ఉంది. త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget