Whatsapp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేస్తుంది - ఇక డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అవసరం కూడా ఉండదు - నేరుగా మెసేజ్‌నే!
ప్రపంచ నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎడిట్ ఫీచర్‌ను త్వరలో తీసుకురానుంది.
వాట్సాప్ త్వరలో పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేసే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వినియోగదారులు మెసేజ్‌ల్లో టైపింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేయవచ్చు. మెసేజ్ డిలీట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతోపాటు మెసేజ్ రియాక్షన్లకు కూడా ప్రత్యేకమైన స్కిన్ టోన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇవి బీటా టెస్టింగ్‌లో ఉన్నాయి. టెస్టింగ్ పూర్తయ్యాక అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo కథనం ప్రకారం... టెక్స్ట్ మెసేజ్‌లను ఎడిట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షించడం ప్రారంభించింది. అయితే మీరు మెసేజ్‌లను ఎడిట్ చేస్తే ఎడిట్ చేసిన విషయం యూజర్‌కి తెలుస్తుందో లేదో మాత్రం ఇందులో సమాచారం లేదు.
యాప్‌లో మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ చూడవచ్చు. దీంతోపాటు ఐవోఎస్, డెస్క్‌టాప్ యూజర్లకు కూడా త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
2016 నుంచే వాట్సాప్ మెసేజ్‌లను ఎడిట్ చేయడంపై కంపెనీ పనిచేస్తుంది. అయితే ఇప్పటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఎడిట్‌తో పాటు మెసేజ్ రియాక్షన్లను కూడా వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.22.13.4లో ఈ ఫీచర్లు చూడవచ్చు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram