By: ABP Desam | Updated at : 12 Oct 2022 11:14 AM (IST)
Photo@Pixabay
గ్రూప్ సభ్యులను 1,024కు పెంచుకోవచ్చు!
యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న వాట్సాప్.. మరో గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెండింతలకు పైగా పెంచబోతున్నది. కొద్ది వారాల క్రితం వరకు గ్రూపులో కేవలం 256 మంది సభ్యులనే చేర్చుకునే వెసులుబాటు ఉండేది. ఆ సంఖ్యను కొద్ది రోజుల క్రితం 512కు పెంచింది. ఇప్పుడు గ్రూపులో సభ్యుల సంఖ్యను ఏకంగా 1,024కు పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే కొంత మంది వాట్సాప్ బీటా యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ అప్ డేట్, పూర్తయిన వెంటనే మిగతా యూజర్లకూ చేరనుంది. వాట్సాప్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఓకేసారి గ్రూపులో వెయ్యి మందికి పైగా సభ్యులతో చాట్ చేసే వెసులుబాటు ఉంటుంది.
Read Also: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!
గ్రూపులో చేరాలంటే అడ్మిన్ అప్రూవ్ తప్పనిసరి
గ్రూపు సభ్యుల పెంపుతో పాటు వాట్సాప్ మరో ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నది. గ్రూప్ అడ్మిన్ల కోసం అప్రూవల్ సిస్టమ్ ను పరిచయం చేయబోతున్నది. ఎవరైనా గ్రూపులో చేరాలి అనుకుంటే.. అడ్మిన్ అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. గ్రూపులో చేరేందుకు వచ్చిన రిక్వెస్టులన్నీ, పెండింగ్ పార్టిసిపెంట్స్ రూపంలో కనిపిస్తాయి. వాటిని అడ్మిన్ చెక్ చేసుకుని.. ఆ వ్యక్తులను గ్రూపు సభ్యులుగా ఉంచాలి అనుకుంటే యాక్సెప్ట్ చెయ్యొచ్చు. వద్దు అనుకుంటే రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేయొచ్చు.
WhatsApp is releasing larger groups up to 1024 participants!
— WABetaInfo (@WABetaInfo) October 8, 2022
Some lucky beta testers on WhatsApp beta for Android and iOS can add up to 1024 participants to their groups!https://t.co/qDbG3AWaIu pic.twitter.com/oI8Dtg30RK
వాట్సాప్ కాల్ లింక్ సహా పలు ఫీచర్ల టెస్టింగ్
త్వరలో వాట్సాప్ కాల్ లింక్ ఫీచర్ ను సైతం అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ జూమ్, గూగుల్ మీట్ యాప్స్ మాదిరిగా పనిచేస్తుంది. ఎవరినైనా గ్రూప్ కాల్ లో చేర్చుకోవాలి అంటే వారికి కాల్ లింక్స్ పంపితే సరిపోతుంది. ఆ లింక్స్‌పై క్లిక్ చేయడం ద్వారా యూజర్లు గ్రూప్ కాల్స్ లో చేరే అవకాశం ఉంటుంది. అటు యూజర్ల ప్రైవసీ విషయంలోనూ వాట్సాప్ కీలక నిర్ణం తీసుకుంది. ‘వ్యూ వన్స్’ పేరుతో స్క్రీన్ షాట్ బ్లాక్ ఫీచర్ ను తీసుకొస్తోంది. యూజర్లు వ్యూ వన్స్ ద్వారా పంపే మెసేజ్‌లతో పాటు ఫోటోలను అవతలి వ్యక్తులు స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం ఉండదు. మరోవైపు యూజర్లు వాట్సాప్ స్టేటస్ లో ఆడియో మెసేజ్‌లను కూడా పెట్టుకునే వెసులుబాటు కల్పించబోతున్నది. ముందుగాస్టేటస్ బటన్ క్లిక్ చేస్తే.. వాయిస్ రికార్డ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా వాయిస్ స్టేటస్ ను సెట్ చేసుకోవచ్చు.
Read Also: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
ChatGPT vs Bard: చాట్ జీపీటీకి పోటీగా బార్డ్‌ను తీసుకొస్తున్న గూగుల్ - రెండిటికీ తేడా ఏమిటీ?
Smartphones Under 15000: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - అన్ని ఫీచర్లు అదుర్స్!
Google Chrome Extensions: మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఈ 8 ఎక్స్‌టెన్సన్స్‌తో బోలెడంత టైమ్ సేవ్ చేయొచ్చు!
Twitter Gold: గోల్డ్ టిక్కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!
నాడు రావాలి జగన్-కావాలి జగన్, నేడు "మా నమ్మకం నువ్వే జగన్"
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Shiva Rajkumar Emotional : కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ
Pawan Kalayan Fans: దుర్గమ్మకు పవన్ సమర్పించిన చీరకు ఫుల్ డిమాండ్- తలపట్టుకుంటున్న కాంట్రాక్టర్!