Password Mistakes: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!
పాస్ వర్డ్స్ పెట్టుకోవడంలో చేసే చిన్ని చిన్న పొరపాట్లు హ్యాకర్లకు వరంగా మారుతున్నాయి. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ లేకపోవడం మూలంగా నిత్యం వేల సంఖ్యలో అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి.
టెక్నాలజీ రోజు రోజుకు మరింత ప్రగతి సాధిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా వేలాది మంది డిస్నీ+ వినియోగదారులు భారీ హ్యాకింగ్ బారిన పడ్డారు. తమ అకౌంట్లను కోల్పోయారు. ఆ హ్యాక్ చేయబడిన ఖాతాలు డార్క్ వెబ్‌లో విక్రయించబడినట్లు ‘ది మార్కెట్ రియలిస్ట్’ వెల్లడించింది. ఇలాంటి దాడులు పెద్ద ఎత్తున జరగడం మూలంగా వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాస్ వర్డ్స్ విషయంలో చేసే పొరపాట్ల మూలంగానే హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. అందుకే పాస్ వర్డ్స్ పెట్టుకునే సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా పాస్ వర్డ్ ఎంపికలో వినియోగదారులు చేసే తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1.సులభంగా ఊహించగలిగే పాస్వర్డ్ను ఎంచుకోవడం
పాస్ వర్డ్స్ విషయంలో వినియోగదారులు చేసే తప్పులు హ్యాకర్లకు వరంగా మారుతాయి. సాధారణంగా పాస్ వర్డ్స్ విషయంలో పుట్టిన రోజులు ఉపయోగించడం, లేదంటే 1234 లాంటి సాధారణ పాస్ వర్డ్‌లను పెట్టుకుంటారు. బ్రాండ్ పేర్లు, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లతోనే పాస్ వర్డ్స్ ఏర్పాటు చేసుకుంటారు. వీటిని హ్యాకర్లు ఈజీగా గుర్తిస్తారు.
2.సరిపడ నెంబర్స్,స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకోకపోవడం
పాస్ వర్డ్ పెట్టుకునే సమయంలో నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ వినియోగించడం మంచిది. వీటితో పాస్ వర్డ్ కఠినంగా ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు kr3st3v@798! లాంటి పాస్ వర్డ్స్ను ఉపయోగించడం ఉత్తమం.
3.చాలా సైట్లకు ఒకే పాస్వర్డ్ని ఉపయోగించడం
ప్రతి అకౌంట్ లాగిన్ చేయడానికి ఒకే పాస్‌వర్డ్‌ను వాడటం చాలా మంది చేసే పెద్ద తప్పు. కేవలం ఒక సెట్ లాగ్ ఇన్ ఆధారాలతో, హ్యాకర్లు అదే ఇమెయిల్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి ఇతర సైట్‌లకు లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వేర్వేరు అకౌంట్లకు వేర్వేరు పాస్ వర్డ్స్ పెట్టుకోవాలి.
4.మీ పాస్ వర్డ్స్ ఎప్పుడు మార్చాలి?
ప్రతి సంవత్సరం మీ పాస్ వర్డ్ ను మార్చుకోవాలని కొంత మంది నిపుణులు వినియోగదారులకు చెప్తుంటారు. ఇది కొంత ఇబ్బంది అయినా, మంచి నిర్ణయమే.
5.చాలా చిన్న పాస్వర్డ్ పెట్టుకోకూడదు
చిన్న చిన్న పాస్ వర్డ్స్ పెట్టుకోవడం సరికాదు. సాధారణంగా 15 కంటే ఎక్కువ నెంబర్స్, క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఉండటం మూలంగా హ్యాకింగ్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.
6.డేటా ఉల్లంఘన వార్తలను విస్మరించడం
మీ పాస్‌వర్డ్ ఒక ఉల్లంఘనలో బయటకు వస్తే.. మీరు దాన్ని తిరిగి ఉపయోగించిన ప్రతి ఖాతా ప్రమాదంలో ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీరు 20 సైట్‌లకు ఒకే పాస్‌వర్డ్‌ని ఉపయోగిస్తే.. వాటిలో ఒకటి నిబంధనలు ఉల్లంఘించినా మిగతా అన్ని పాస్ వర్డ్స్ మార్చుకోవడం మంచింది.
7.గుర్తుంచుకోవడం సాధ్యం కాని పాస్వర్డ్లను ఎంచుకోవడం
కొన్ని ఆన్‌లైన్ ద్వారా పాస్‌వర్డ్ జనరేటర్ అవుతాయి. ఇవి చాలా స్ట్రాంగ్ పాస్ వర్డ్స్. వీటిని గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు పాస్ వర్డ్‌లను కాగితం మీద రాసి పెట్టుకోవాలి. లేదంటే ఫోన్, కంప్యూటర్ లో నోట్‌పై సేవ్ చేస్తారు.
8.పాస్వర్డ్లను సురక్షితంగా లేని ప్రదేశాలలో నిల్వ చేయడం
సురక్షితంగా లేని ప్రదేశాలలో పాస్ వర్డ్స్ సేవ్ చేయకూడదు. ప్రస్తుతం పాస్ వర్డ్స్ స్టోర్ చేసుకునే సురక్షిత ప్రదేశాలు అందుబాటులోకి వచ్చాయి. Google పాస్ వర్డ్ మేనేజర్ ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. Apple లో పాస్ వర్డ్‌ని స్టోర్ చేసే కీచైన్‌ని కలిగి ఉంది.
9.మీ పాస్వర్డ్ను కొద్దిగా సవరించడం
పాస్ వర్డ్స్ మర్చి పోకుండా అప్పుడప్పుడు కొద్దిగా సవరిస్తూ ఉండాలి. అలా చేయడం మూలంగా పాస్ వర్డ్ ను ఈజీగా గుర్తుచుకోవడంతో పాటు హ్యాకింగ్ ముప్పును తప్పించుకోవచ్చు.
10.హానికరమైన పాస్వర్డ్ జనరేటర్లను ఉపయోగించడం
ఒక నియమం ప్రకారం, పాస్‌వర్డ్‌లను రూపొందించే ఆన్‌లైన్ సేవలపై ఆధారపడకూడదు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. కాబట్టి, ప్రజలు ఆన్‌లైన్ పాస్‌వర్డ్ ఉత్పత్తి సేవలను ఉపయోగించకుండా ఉండటం మంచిది.
11.మీరు గుర్తుంచుకోలేని పాస్వర్డ్లను ఎంచుకోవడం
పాస్ వర్డ్స్ పొడవుగా ఉండాలి. నిర్మాణంలో సంక్లిష్టతను కలిగి ఉండాలి. ఉదాహరణకు మీ కుటుంబం, పెంపుడు జంతువులు, తేదీలు, స్థానాలతో ఎటువంటి సంబంధం లేని నర్సరీ రైమ్ నుంచి వినియోగదారులు పలు పాస్ వర్డ్స్ రూపొందించుకోవచ్చు.
12.పాస్వర్డ్ మేనేజర్ని ఉపయోగించడం
పాస్‌వర్డ్‌లు, రహస్య 'కోడ్‌లను సురక్షితంగా నిర్వహించడానికి LastPass తో పాటు ఇలాంటి పాస్‌వర్డ్ మేనేజర్‌లను ఉపయోగించడం మంచింది.