By: ABP Desam | Updated at : 24 Sep 2023 08:30 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం ( Image Source : Freepik )
గణేష్ చతుర్థి సందర్భంగా రిలయన్స్ జియో భారతదేశంలోని ఎనిమిది నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి మీ ఇళ్లలో ఎయిర్ ఫైబర్ ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభమవుతుంది. చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే, మీ ఇంటికి ఎంత ఎంబీపీఎస్ ప్లాన్ సరిపోతుంది? అది ఎయిర్ ఫైబర్ ప్లాన్ అయినా లేదా సాధారణ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్ అయినా.
ఈ రెండింటి విషయంలోనూ ప్రజల మనస్సులో కాస్త గందరగోళం ఉంది. కొన్ని సార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మన వినియోగాన్ని బట్టి కావాల్సిన ప్లాన్ ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ఇంట్లో మనందరికీ మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు మొదలైన వాటికి ఇంటర్నెట్ అవసరం. మీరు కూడా ఈ గాడ్జెట్స్ అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ ప్లాన్ కొనాలని ఆలోచిస్తుంటే 10 ఎంబీపీఎస్ నుంచి 30 ఎంబీపీఎస్ ఫైబర్ ప్లాన్, 30 ఎంబీపీఎస్ ఎయిర్ ఫైబర్ ప్లాన్ మీకు ఉత్తమమైనది.
30 ఎంబీపీఎస్ ప్లాన్‌లో ఒక కంప్యూటర్, నాలుగు నుంచి ఐదు మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ టీవీ మొదలైనవాటిని సులభంగా ఉపయోగించగలవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా మీరు మంచి డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్ పొందుతారు. అలాగే ఈ ప్లాన్ ప్రయోజనం ఏమిటంటే ఇది మీ జేబుపై ఎక్కువ భారం పడదు. అలాగే బడ్జెట్ కూడా స్థిరంగా ఉంటుంది. మీరు రూ. 500 కంటే తక్కువ ధరకు 30 ఎంబీపీఎస్ ప్లాన్‌ని పొందుతారు.
సర్వీస్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉంది. వ్యక్తిగత పని కారణంగా మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ కావాలంటే మీ సౌలభ్యం ప్రకారం 30 లేదా 50 Mbps లేదా 100 Mbps ప్లాన్‌ని తీసుకోవచ్చు. సాధారణ కుటుంబానికి 10 నుంచి 30 ఎంబీపీఎస్ ప్లాన్ సరిపోతుంది. మీ గాడ్జెట్స్ అన్నీ ఇందులో సులభంగా పని చేస్తాయి.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!
Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!
BRS Chief KCR: ఓటమి తరువాత తొలిసారి పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ
Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!
Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం
/body>