అన్వేషించండి

Facebook Server Down: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ ఎందుకు డౌన్ అయ్యాయి.. ఆ 7 గంటల్లో ఏం జరిగింది? అసలు కారణం అదేనా?

ప్రపంచ నంబర్‌వన్ వాట్సాప్, సోషల్ మీడియా సర్వీసులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం సోమవారం రాత్రి ఏడు గంటల పాటు నిలిపిపోయిన సంగతి తెలిసిందే. దీనికి అసలు కారణం ఏంటంటే?

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ సోమవారం రాత్రి ఒక్కసారిగా ఏడు గంటల పాటు పనిచేయడం ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్స్‌కు వందల కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరందరూ ఈ సేవలు నిలిచిపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే మనదేశంలో మాత్రం ఈ సేవలు నిలిచిపోయిన ప్రభావం తక్కువగానే ఉంది. ఎందుకంటే అందరూ నిద్రపోయే టైంలో ఇవి నిలిచిపోయాయి. మహా అయితే కాసేపు ప్రయత్నించి తెల్లారి చూసుకుందాం అని కొంచెం త్వరగా నిద్రపోయి ఉంటారు. మనదేశ కాలమానం ప్రకారం చూసుకుంటే రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామన నాలుగు గంటల వరకు ఈ అవుటేజ్ ఉంది.

ఫేస్‌బుక్ రూటర్లకు చేసిన కాన్ఫిగరేషన్ చేంజెస్‌లో తలెత్తిన లోపాల కారణంగా ఈ అంతరాయం ఏర్పడిందని కంపెనీ అంటోంది. అయితే కొంతమంది పరిశోధకులు మాత్రం బోర్డర్ గేట్‌వే ప్రొటోకాల్‌లో సమస్యల కారణంగా ఈ అంతరాయం ఏర్పడిందని అంటున్నారు.

బీజీపీ అంటే ఏంటి?
బీజీపీ గురించి తెలియాలంటే ముందుగా ఇంటర్నెట్ గురించి తెలుసుకోవాలి. అటానమస్ సిస్టమ్స్‌గా పేరున్న పెద్ద నెట్‌వర్క్‌లు అన్నీ కలిపి ఏర్పడిన నెట్‌వర్కే ఇంటర్నెట్. సమాచారాన్ని ఈ నెట్‌వర్క్‌ల నుంచి మిగతా ఇంటర్నెట్‌కు అందించడానికి ఉపయోగించే ప్రోటోకాలే ఈ బీజీపీ. అటానమస్ సిస్టమ్స్ మధ్య సమాచారాన్ని రూటింగ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఫేస్‌బుక్ ఎందుకు డౌన్ అయింది?
ఫేస్‌బుక్ బ్యాక్ బోన్ రూటర్స్‌కు చేసిన కాన్ఫిగరేషన్ చేంజ్‌లో ఉన్న లోపాల కారణంగా ఈ సమస్య తలెత్తిందని ఫేస్‌బుక్ అంటోంది. సేవలు నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్తోంది. ఫేస్‌బుక్ డీఎన్ఎస్ సర్వర్స్ పూర్తిగా ఆఫ్‌లైన్ అయ్యాయని కొందరు క్లౌడ్ ఫేర్ రీసెర్చర్లు గుర్తించారు. ఇందువల్లే ఫేస్‌బుక్, దాని సర్వీసులు ఇంటర్నెట్ నుంచి డిస్‌కనెక్ట్ అయిపోయాయని అంటున్నారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఉన్న డేటా సేఫేనా?
కాన్పిగరేషన్ చేంజ్‌లో లోపాల కారణంగానే ఈ సేవలు నిలిచిపోయాయని.. సర్వీసులు డౌన్ అయిన సమయంలో డేటా లీక్ అయిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ లేవని ఫేస్‌బుక్ తన బ్లాగ్ పోస్టులో తెలిపింది. ఫేస్‌బుక్ సేవలు ఆఫ్‌లైన్ వెళ్లడంలో ఎటువంటి కుట్ర కోణం కానీ, హ్యాకింగ్ కానీ ఉన్నట్లు ఆధారాలు కూడా లేవని నిపుణులు అంటున్నారు.

ప్రభావం ఎంతవరకు?
ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ వినియోగదారులు 280 కోట్ల మంది ఉన్నారు. వాట్సాప్‌కు 200 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రాంకు 100 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ మూడు యాప్స్‌కు మనదేశంలో కూడా చాలా మంది వినియోగదారులు ఉన్నారు. మనదేశంలో ఫేస్‌బుక్ వినియోగదారులు 41 కోట్ల మంది, వాట్సాప్ ఉపయోగించేవారు 53 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రాం ఉపయోగించేవారు 21 కోట్ల మంది ఉన్నారు. దీంతోపాటు ఫేస్‌బుక్ సర్వీసులపై ఆధారపడ్డ లోకల్ బిజినెస్‌లు కూడా చాలానే ఉన్నాయి.

ఉదాహరణకు మనదేశంలో ఉన్న మీషో వంటి సర్వీసులనే తీసుకుంటే.. దీనికి సంబంధించిన కమ్యూనికేషన్ ఎక్కువ వాట్సాప్ మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి ఇటువంటి వాటి మీద కూడా ఈ అంతరాయం ప్రభావం ఉంది. ఈ సమయంలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఆస్తులు కూడా భారీగా ఆవిరయ్యాయి. ఈ అవుటేజ్ కారణంగా ఈయన దాదాపు 7 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.52 వేల కోట్లు అన్న మాట.

ఇక దీనిపై అనేక స్పెక్యులేషన్లు, గాసిప్స్ కూడా వచ్చాయి. అమెరికాలో సరిగ్గా స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యే ముందు ఈ అవుటేజ్ మొదలైంది. ఎవరో కావాలనే ఫేస్‌బుక్ నష్టాల పాలవ్వాలని చేశారని కొంతమంది అంటున్నారు. దీంతోపాటు కోడింగ్‌లో భారీగా డేటా డిలీట్ అవుతుందని కొందరు సోర్స్ కోడ్ స్క్రీన్ షాట్లు పెట్టారు. దీనికి తగ్గట్లే సర్వీసులు బ్యాక్ అయ్యాక.. తమ ఖాతాలు కనపడటం లేదని, వ్యక్తిగత డేటా మిస్ అయిందని కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

దీంతోపాటు ఈ అవుటేజ్ సమస్యను పరిష్కరిస్తున్న సమయంలో కొందరు ఉద్యోగులు ఆఫీసులోకి వెళ్లడానికి యాక్సెస్ కార్డులు కూడా పనిచేయలేదని, కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. ఏదో పెద్ద సమస్యే తలెత్తిందని, దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా చాలా మంది ఆ సమయంలో అన్నారు. ఇదే సమయంలో 150 కోట్ల మందికి చెందిన ఫేస్‌బుక్ డేటా లీకైందని, దాన్ని విక్రయిస్తున్నట్లు కూడా కొన్ని పోస్టులు కనిపించాయి.

గతంలో ఎప్పుడు సర్వర్ డౌన్ అయినా సరే.. అరగంట నుంచి గంట లోపే సమస్యను పరిష్కరించే ఫేస్‌బుక్‌కు ఈసారి ఇంత సమయం ఎంత పట్టిందనే ప్రశ్న కూడా తలెత్తింది. అసలు ఈ అవుటేజ్‌కు నిజంగానే సాంకేతిక లోపమే కారణమా.. లేదా కుట్రకోణం ఉందా.. ఫేస్‌బుక్ దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుందా.. అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికి తోడు పండోరా పేపర్స్ లీకైన తర్వాత రోజే ఫేస్‌బుక్ పనిచేయకపోవడంతో.. దాన్ని పక్కదోవ పట్టించేందుకు ఈ అవుటేజ్ చేశారని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఈ సేవలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రపంచం మొత్తంగా ఒక్కసారిగా స్తంభించిపోయింది. దీన్ని బట్టి మనం టెక్నాలజీ మీద ఎంత ఆధారపడుతున్నాం అనేది కూడా తెలుస్తోంది. కాబట్టి ఇకనైనా మనం టెక్నాలజీ, సోషల్ మీడియా అడిక్షన్‌ను తగ్గించుకోవాలి.

Also Read: తక్కువ ధరలో ఐఫోన్.. రూ.20 వేలలోపే కొనేయచ్చు!

Also Read: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది.. ఏకంగా 108 మెగాపిక్సెల్ కెమెరాతో.. ధర ఎంతంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget