Vu Masterpiece Glo QLED TV: ఈ టీవీలు నిజంగా మాస్టర్ పీసే - వూ కొత్త టీవీలు వచ్చేశాయ్!
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ వూ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీలు లాంచ్ చేసింది.
వూ మాస్టర్‌పీస్ గ్లో క్యూఎల్ఈడీ టీవీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. ఇవి హైఎండ్ లగ్జరీ స్మార్ట్ టీవీలు. 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల సైజుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి. 3 జీబీ వరకు ర్యామ్, 16 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. 100W అర్మానీ గోల్డ్ 4.1 చానెల్ సౌండ్ సిస్టం ఇందులో ఉండటం విశేషం. 2020లో వూ మనదేశంలో మాస్టర్ పీస్ 85 అంగుళాల టీవీని లాంచ్ చేసింది.
వూ మాస్టర్ పీస్ గ్లో క్యూఎల్ఈడీ టీవీ ధర
ఇందులో 55 అంగుళాల మోడల్ ధరను రూ.74,999గా నిర్ణయించారు. ఇక 65 అంగుళాల మోడల్ ధర రూ.99,999గానూ, 75 అంగుళాల మోడల్ ధర రూ.1,79,999గానూ నిర్ణయించారు. ఈ స్మార్ట్ టీవీలను వూ వెబ్‌సైట్, అమెజాన్‌ల్లో కొనుగోలు చేయవచ్చు.
వూ మాస్టర్ పీస్ గ్లో క్యూఎల్ఈడీ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వీటిలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 4కే క్యూఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించారు. ఈ టీవీల పీక్ బ్రైట్‌నెస్ 800 నిట్స్‌గా ఉంది. 55 అంగుళాలు, 65 అంగుళాలు, 75 అంగుళాల స్క్రీన్ సైజుల్లో ఈ టీవీలు కొనుగోలు చేయవచ్చు. వీటిలో అంచులు లేని డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్10+, హెచ్ఎల్‌జీ, డాల్బీ విజన్ ఐక్యూ ఫీచర్ కూడా ఉంది. 4.1 చానెల్ 100W స్పీకర్లు ఇందులో ఉండటం విశేషం. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది.
ఈ టీవీల్లో క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉండనుంది. 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీలు పనిచేయనున్నాయి. గూగుల్ ప్లే, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే... ఈ స్మార్ట్ టీవీల్లో వైఫై, బ్లూటూత్ వీ5, ఎథర్‌నెట్ పోర్టు, నాలుగు హెచ్‌డీఎంఐ 2.1 పోర్టులు, ఒక యూఎస్‌బీ 3.0 పోర్టు, ఒక యూఎస్‌బీ 2.0 పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్, డిజిటల్ ఆడియో అవుట్‌పుట్, ఏవీ ఇన్‌పుట్ పోర్టు కూడా ఉండనున్నాయి. బ్లూటూత్/ఐఆర్ రిమోట్‌ను కూడా వీటిలో అందించారు.
ఈ టీవీ ఇంగ్లిష్, హిందీ గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్‌ను సపోర్ట్ చేయనుంది. యాంబియంట్ లైట్ సెన్సార్ కూడా ఇందులో అందించారు. వీటిలో 55 అంగుళాల టీవీ బరువు 15.6 కేజీలుగా ఉంది. 65 అంగుళాల టీవీ బరువు 19.1 కేజీలు కాగా... 75 అంగుళాల టీవీ బరువు 29.1 కేజీలుగా ఉంది.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!