By: ABP Desam | Updated at : 01 Jan 2022 07:14 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో వై21టీ
వివో వై21టీ స్మార్ట్ ఫోన్ కంపెనీ వై-సిరీస్‌లో లాంచ్ అయింది. ఇందులో వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లేను అందించారు. ఫోన్‌లో వాటర్ డ్రాప్ నాచ్, వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
వివో వై21టీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర 30,99,000 ఇండోనేషియా రూపాయలుగా (సుమారు రూ.16,200) నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మిడ్ నైట్ బ్లూ, పెరల్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వివో వై21టీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 2 జీబీ పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
4జీ ఎల్టీఈ, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 182 గ్రాములుగా ఉంది.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Instagram photo edit: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?
5G Phones Under Rs 20k: రూ.20 వేలలోపు టాప్ 5జీ ఫోన్లు ఇవే - న్యూ ఇయర్ ఆఫర్లలో రేట్ ఇంకా తగ్గచ్చేమో!
Whatsapp Privacy: వాట్సాప్ వెబ్ వాడే వాళ్లు కచ్చితంగా ఆన్ చేసుకోవాల్సిన ఫీచర్ - లేకపోతే ప్రైవసీ డేంజర్‌లో!
Airtel Netflix Plan: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ - రీఛార్జ్‌కు ఎంత పెట్టాలి?
Smartphones Under Rs 30000: రూ.30 వేలలోపు మంచి టాప్ ఎండ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? - ఈ టాప్-5 ఆప్షన్లు అయితే బెస్ట్!
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>