అన్వేషించండి

Vivo V30e: రూ.30 వేలలోపే వివో కొత్త ఫోన్ - సూపర్ ఫీచర్లతో వీ30ఈ లాంచ్!

Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వీ30ఈ. దీని ధర రూ.27,999 నుంచి ప్రారంభం కానుంది.

Vivo V30e Launched: వివో వీ30ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్‌ను అందించారు. గతేడాది వచ్చిన వివో వీ29ఈకి తర్వాతి వెర్షన్‌గా వివో వీ30ఈ మనదేశంలో లాంచ్ అయింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై వివో వీ30ఈ రన్ కానుంది.

వివో వీ30ఈ ధర (Vivo V30e Price in India)
ఇందులో రెండు వేరియంట్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా నిర్ణయించారు. మే 9వ తేదీన దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్, ఐడీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంకుల వినియోగదారులకు అయితే 10 శాతం ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది 

వివో వీ30ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo V30e Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. మూడు జనరేషన్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, స్క్రీన్ టు బాడీ రేషియో 93.3 శాతంగా ఉంది. 4 ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై వివో వీ30ఈ రన్ కానుంది. ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా అందించారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ సెన్సార్ వివో వీ30ఈలో ఉంది. ముందు, వెనక కెమెరాలు రెండిటికీ 4కే రికార్డింగ్ సామర్థ్యం ఉంది. 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.

5జీ, 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, బైదు, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీని అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్లను కూడా ఇందులో చూడవచ్చు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే 22 గంటల పాటు యూట్యూబ్ స్ట్రీమ్ చేయవచ్చు. 53 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ లభించనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.

Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kohli 51st Century:  విరాట ప‌ర్వం.. సెంచ‌రీతో కోహ్లీ వీర‌విహారం, భార‌త్ ఘ‌న విజ‌యం.. టోర్నీ నుంచి పాక్ ఔట్!
విరాట ప‌ర్వం.. సెంచ‌రీతో కోహ్లీ వీర‌విహారం, భార‌త్ ఘ‌న విజ‌యం.. టోర్నీ నుంచి పాక్ ఔట్!
IND vs PAK Jio Hotstar live streaming Record: వ్యూయర్‌షిప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌ రికార్డు- జియో హాట్‌స్టార్‌లో అన్ని కోట్ల మంది చూశారా
వ్యూయర్‌షిప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌ సరికొత్త రికార్డు- జియో హాట్‌స్టార్‌లో అన్ని కోట్ల మంది చూశారా
Samantha: సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్
సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్
Raja Singh: ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం! ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ కలకలం
ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం! ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ కలకలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pak vs Ind First Innings Highlights | Champions Trophy 2025 బౌలింగ్ తో పాక్ ను కట్టడి చేసిన భారత్SLBC Tunnel Incident Update | NDRF అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ | ABP DesamInd vs Pak Champions Trophy 2025 | కింగ్ విరాట్ కొహ్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడా | ABP DesamInd vs Pak Head to Head Records | Champions Trophy 2025 భారత్ వర్సెస్ పాక్...పూనకాలు లోడింగ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kohli 51st Century:  విరాట ప‌ర్వం.. సెంచ‌రీతో కోహ్లీ వీర‌విహారం, భార‌త్ ఘ‌న విజ‌యం.. టోర్నీ నుంచి పాక్ ఔట్!
విరాట ప‌ర్వం.. సెంచ‌రీతో కోహ్లీ వీర‌విహారం, భార‌త్ ఘ‌న విజ‌యం.. టోర్నీ నుంచి పాక్ ఔట్!
IND vs PAK Jio Hotstar live streaming Record: వ్యూయర్‌షిప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌ రికార్డు- జియో హాట్‌స్టార్‌లో అన్ని కోట్ల మంది చూశారా
వ్యూయర్‌షిప్‌లో భారత్, పాక్ మ్యాచ్‌ సరికొత్త రికార్డు- జియో హాట్‌స్టార్‌లో అన్ని కోట్ల మంది చూశారా
Samantha: సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్
సమంతకు నచ్చిన హీరోయిన్లు, వాళ్ళ సినిమాలు... నాగ చైతన్యతో నటించిన అమ్మాయి కూడా ఉందండోయ్
Raja Singh: ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం! ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ కలకలం
ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం! ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ కలకలం
Nara Lokesh In Dubai: దుబాయ్ లో దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ సందడి- ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతే..
దుబాయ్ లో దేవాన్ష్‌తో కలిసి నారా లోకేష్ సందడి- ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతే..
Shivangi Teaser: 'ఇక్కడ బ్యూటీ నేనే.. బీస్ట్ కూడా నేనే' - 'శివంగి'గా ఆనంది విశ్వరూపం, టీజర్ చూశారా!
'ఇక్కడ బ్యూటీ నేనే.. బీస్ట్ కూడా నేనే' - 'శివంగి'గా ఆనంది విశ్వరూపం, టీజర్ చూశారా!
Google Pay : గూగుల్ పే బాదుడు షురూ.. కార్డుల ద్వారా బిల్లులు చెల్లిస్తే ఛార్జి కట్టాల్సిందే
గూగుల్ పే బాదుడు షురూ.. కార్డుల ద్వారా బిల్లులు చెల్లిస్తే ఛార్జి కట్టాల్సిందే
Kohli World Record: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. వన్డేల్లో 14వేల పరుగుల మైలురాయి.. భారీ తేడాతో వరల్డ్ రికార్డు
సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. వన్డేల్లో 14వేల పరుగుల మైలురాయి.. భారీ తేడాతో వరల్డ్ రికార్డు
Embed widget