Vivo V30 Lite 4G: బ్లాక్‌బస్టర్ వీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసిన వివో - వీ30 లైట్ 4జీ వచ్చేసింది!
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే వివో వీ30 లైట్ 4జీ.
Vivo V30 Lite 4G Launched: వివో వీ30 లైట్ 4జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ వీ-సిరీస్‌లో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన 5జీ వెర్షన్ నాలుగు నెలలకు ముందు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
వివో వీ30 లైట్ 4జీ ధర (Vivo V30 Lite 4G Price)
ఈ ఫోన్ ధరను రష్యాలో 24,999 రూబుల్స్‌గా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.22,510) నిర్ణయించారు. క్రిస్టలైన్ బ్లాక్, సెరీన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది.
Ride the wave of innovation with the Waving Aqua vivo V30 Series! 🌊 Let its mesmerizing aqua hue inspire your creativity and elevate your photography game. Make a splash with every shot you take.#WavingAqua #Creativity #vivoV30Series #PortraitSoPro pic.twitter.com/XUrgW1ac9w
— vivo Global (@Vivo_GLOBAL) April 6, 2024
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది
వివో వీ30 లైట్ 4జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo V30 Lite 4G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌పై వివో వీ30 లైట్ 4జీ రన్ కానుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ లెన్స్ అందించారు.
256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంటుందని కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో లిస్ట్ చేశారు. కానీ ప్రస్తుతం సేల్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ త్వరలో లాంచ్ అవుతుందేమో చూడాలి. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు.
బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందించారు. దీని మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు