Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Upcoming Smartphones in October 2023: అక్టోబర్‌లో ఎన్నో కంపెనీలు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయనున్నాయి.
Upcoming Smartphones in October: భారతదేశంలో పండుగ సీజన్ అక్టోబర్ నెలలో ప్రారంభం అవుతుంది. చాలా మంది వినియోగదారులు ఈ నెలలో కొత్త ఫోన్‌లను కొనుగోలు చేస్తారు. దీని ప్రయోజనాన్ని పొందడానికి చాలా కంపెనీలు ఈ సీజన్‌లో తమ కొత్త ఫోన్‌లను లాంచ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
అక్టోబర్ నెలలో గూగుల్, రెడ్‌మీ, వన్‌ప్లస్... ఇలా అనేక ఇతర కంపెనీలు తమ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి. వాటి గురించి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీని ద్వారా మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలును ప్లాన్ చేసుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ (Google Pixel 8, Google Pixel 8 Pro)
గూగుల్ తన పిక్సెల్ 8 సిరీస్‌ను అక్టోబర్ 4వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్‌లు లాంచ్ కానున్నాయి, ఇందులో టెన్సర్ జీ3 ప్రాసెసర్ అందించనున్నారు. దీనికి అదనంగా ఈ గూగుల్ ఫోన్‌ల్లో టైటాన్ సెక్యూరిటీ ఎం2 చిప్ కూడా ఉండనుంది.
గూగుల్ పిక్సెల్ 8లో 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనున్నాయి. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ రెండు ఫోన్‌ల మధ్య ఒకే తేడా ఏమిటంటే ఎల్టీపీవో టెక్నాలజీ. ఇది గూగుల్ పిక్సెల్ 8 ప్రోలో ఉండనుంది. కెమెరా సెటప్ గురించి చెప్పాలంటే గూగుల్ పిక్సెల్ 8లో 50 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. గూగుల్ పిక్సెల్ 8 ప్రోలో 50 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. గూగుల్ పిక్సెల్ 8లో 4500 ఎంఏహెచ్, పిక్సెల్ 8 ప్రోలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండనున్నాయి.
వన్‌ప్లస్ ఓపెన్ (OnePlus Open)
వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్’ అక్టోబర్ 9వ తేదీన లాంచ్ కానుందని తెలుస్తోంది. మార్కెట్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్‌లో 7.8 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 6.3 అంగుళాల ఓపెన్ డిస్‌ప్లే ఉండనుంది. ఈ రెండిటీ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది.
వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ఇది 16 జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 4800 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. వన్‌ప్లస్ ఓపెన్ స్మార్ట్‌ఫోన్‌లో హాజిల్ బ్లాడ్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటాయి.
రెడ్‌మీ నోట్ 13 5జీ (Redmi Note 13 5G)
ఈ రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ నెలాఖరున విడుదల కానుంది. రెడ్‌మీ నోట్ 13 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కూడా పొందుతుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌తో రానుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. రెడ్‌మీ నోట్ 13 5జీ వెనుక వైపు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రానుందని సమాచారం.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial