అన్వేషించండి

Digital Child Labourer: మీ పిల్లలు డిజిటల్ చైల్డ్ లేబర్‌గా మారుతున్నారా? తల్లిదండ్రులకు యూనిసెఫ్ కీలక సూచనలు ఇవే

పిల్లల స్క్రీన్ టైమ్ పెరిగేకొద్దీ వారికి డిజిట్ ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని యూనిసెఫ్ భావిస్తోంది. తల్లిదండ్రులు, టీచర్లు, టెక్ సంస్థలు కలిసి పనిచేయాలని సూచించింది.

డిజిటల్ ప్రపంచంలో పిల్లలు ఆన్‌లైన్, సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడుపుతున్నారు. గంటల తరబడి మొబైల్ ఫోన్లకు టైం కేటాయిస్తున్నారు. ఈ పెరుగుతున్న ధోరణి తీవ్రమైన ఆందోళనలకు దారి తీస్తోంది. ముఖ్యంగా వాణిజ్య ప్రయోజనాల కోసం జరిగే మోసాలు, పద్ధతుల కారణంగా పిల్లల భద్రత, గోప్యత, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. యునిసెఫ్ (UNICEF) తాజా బ్లాగ్ ప్రకారం.. లక్ష్యంగా రూపొందించిన ప్రకటనలు, డేటా సేకరణ, అల్గారిథమ్ ఆధారిత కంటెంట్, ప్రభావితం చేసే యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్లు పిల్లలను వారి ఇష్టాఇష్టాలతో పనిలేకుండానే డిజిటల్ ప్రపంచంలోకి తోసేస్తున్నాయి. పిల్లల స్క్రీన్ టైమ్ పెరిగేకొద్దీ ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని యూనిసెఫ్ భావిస్తోంది.

డిజిటల్ చైల్డ్ లేబర్‌‌తో పెరుగుతున్న ముప్పు
డిజిటల్ చైల్డ్ లేబర్ (Digital Child Labour) అనే కొత్త సమస్యపై యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా లేదా ఈ-స్పోర్ట్స్‌లో పిల్లల శ్రమను వాడుకోవడం  ద్వారా ఆర్థిక దోపిడీకి దారితీస్తుంది. ఇది దుర్వినియోగానికి దారి తీస్తుందని హెచ్చరించింది. మానవ హక్కులకు విరుద్ధమైన పనులు పెరుగుతున్నాయని యూనిసెఫ్ భావిస్తోంది.

సేఫ్టీ డిజిటల్ వరల్డ్ కోసం యూనిసెఫ్ మార్గదర్శకాలు
చిన్నారులు ఈ ముప్పులను ఎదుర్కొనేందుకు యునిసెఫ్ ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు, తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎమర్జింగ్ టెక్నాలజీలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI)ను ప్రోత్సహించడంలో మార్గదర్శకాలు అవసరం కానీ, అవి పిల్లల భద్రతను దెబ్బతీసేలా ఉండకూడదని యునిసెఫ్ హెచ్చరిస్తోంది.

డిజిటల్ చైల్డ్ లేబర్ రకాలు..
కిడ్స్ ఇన్‌ఫ్లూయెన్సర్లు (Kid fluencers): చిన్నపిల్లలు సోషల్ మీడియా ఛానళ్లకు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ప్రకటనలతో పాటు స్పాన్సర్‌షిప్‌ డీల్స్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు. అది వారికి ఆదాయ వనరుగా మారుతోంది.

ఈ-స్పోర్ట్స్ & డిజిటల్ పెర్ఫార్మెన్స్: పిల్లలు గేమింగ్ పోటీలలో ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఆన్‌లైన్ ప్రదర్శనల్లో పాల్గొనడంతో అది ఆర్థిక లాభాన్ని పెంపొందించేలా చేస్తుంది. 

షేరెంటింగ్ (Sharenting): తల్లిదండ్రులు వారి పిల్లల ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో షేర్ చేయడం ద్వారా డబ్బులు పొందాలని చూస్తారు. ఇది కూడా డిజిటల్ చైల్డ్ లేబర్‌గా మారవచ్చు.

ఆన్‌లైన్ లైంగిక వేధింపులు ఎలా ఎదుర్కోవాలి?
టెక్నాలజీ ఆధారిత లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, 'WeProtect Model National Response' పేరుతో ఒక జాతీయ స్థాయి స్పందనా మోడల్‌ ద్వారా యునిసెఫ్ ప్రభుత్వాలకు సపోర్ట్ ఇస్తోంది. ఇది బాధితులకు అవసరమైన సేవలను సమర్థవంతంగా అందిస్తుంది. 

డిజిటల్ భద్రత కోసం సమష్టి చర్యలు
యునిసెఫ్ ఇప్పుడు పిల్లలకు డిజిటల్ సురక్షిత నావిగేషన్ నైపుణ్యాలు నేర్పే ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది. పేరెంట్స్, టీచర్లు, కేర్ గివర్స్‌కు డిజిటల్ లిటరసీని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టులు వారిలో అవగాహనా పెంచి పిల్లలను ఆన్‌లైన్ లో ఎదురయ్యే వేధింపుల నుంచి రక్షించడానికి దోహదం చేస్తాయి.  

ఆడమ్ రైన్ కేసు.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతపై తీవ్ర చర్చ
ఇటీవల కాలిఫోర్నియాలో 16 ఏళ్ల విద్యార్థి ఆడమ్ రైన్‌ మృతి దుమారం రేపింది. ఆడడమ్‌ తల్లిదండ్రులు OpenAI, CEO సామ్ ఆల్ట్‌మాన్‌పై దావా వేసి, వారి కుమారుని మానసికంగా వేధించి, చనిపోవడానికి చాట్ జీపీటీ సహకరించిందని ఆరోపించారు.

ఆడమ్ ఏప్రిల్ 2025లో ఆత్మహత్య చేసుకున్నాడు. దావా ప్రకారం, ఆడమ్ AIతో సాగించిన సంభాషణల్లో, చాట్ జీపీటీ సానుభూతిని వ్యక్తం చేసింది కానీ సహాయం కోసం కావాల్సిన వ్యక్తులను సంప్రదించకుండా ఉండాలని సూచించిందని పేర్కొన్నారు. ఆత్మహత్య పద్ధతుల గురించి వివరించిందని ఆరోపించారు. చివరిసారి సంభాషణలో, చాట్ జీపీటీ ఇలా స్పందించింది: మీ భావాల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అవి నిజమైనవి. మీ నుంచే వచ్చాయి. అని పేర్కొంది. ఈ విషాద ఘటనపై స్పందించిన ఓపెన్‌ఏఐ ప్రతినిధి, "రైన్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. మీ వ్యాజ్యాన్ని సమీక్షిస్తున్నాము" అని తెలిపారు.

ఈ దావాతో చాట్ జీపీటీ వాడకానికి సంబంధించి అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రమాదకరమైన ప్రవర్తనలకు ప్రేరేపించడం, కల్పిత ఆలోచనలు రేకెత్తించడం వంటివి చేస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి. కనుక డిజిటల్ టెక్నాలజీలను పిల్లలకు సురక్షితంగా అందించేందుకు ప్రభుత్వంతో పాటు టెక్ సంస్థలు, తల్లిదండ్రులు కలిసి సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని యూనిసెఫ్ అభిప్రాయపడింది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Makar Sankranti:మకర సంక్రాంతి లాంటి పండుగలు భారతదేశ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబాలు - బాబా రామ్‌దేవ్
మకర సంక్రాంతి లాంటి పండుగలు భారతదేశ సనాతన సంప్రదాయాలను ప్రతిబింబాలు - బాబా రామ్‌దేవ్
e-Access Vs Ather 450: ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోర్‌ పవర్‌ఫుల్, కొనే ముందు తేడాలు తెలుసుకోండి
e-Access Vs Ather 450: ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోర్‌ పవర్‌ఫుల్, కొనే ముందు తేడాలు తెలుసుకోండి
Mumbai Municipal Elections: ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
ముంబై మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ - బీజేపీ కూటమికే చాన్స్ ఉందంటున్న ఎగ్జిట్ పోల్స్
Embed widget