అన్వేషించండి

Digital e-Passport : ఈ-పాస్ పోర్ట్: విదేశాలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్! కొత్త ఫీచర్లు, సులభ దరఖాస్తు విధానం!

ఈ-పాస్‌పోర్ట్ అనేది ఇప్పటి వరకు మీరు వాడుతున్న పాస్‌పోర్టుకు మోడ్రన్ రూపమే. ఈ పాస్‌పోర్టులో ఫిజికల్ మరియు డిజిటల్ లక్షణాలు ఉంటాయి. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ ఉంటుంది.

Digital e-Passport : విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ తప్పనిసరి. ఇప్పుడు సాంప్రదాయ పాస్‌పోర్టును నవీకరించి, ఈ-పాస్‌పోర్టును మన విదేశాంగ శాఖ ప్రారంభించింది. భారతీయ పౌరులందరూ ఈ మోడ్రన్ ట్రావెల్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ-పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి...

ఈ-పాస్‌పోర్టును తొలిసారిగా భారత విదేశాంగ శాఖ ఏప్రిల్ 1, 2024న ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. దేశంలో కొన్ని ఎంపిక చేసిన పాస్‌పోర్ట్ కేంద్రాల నుండి మాత్రమే ఈ-పాస్‌పోర్టును జారీ చేసే అవకాశం ఇచ్చారు. అయితే, ఇక ముందు ఈ సేవలను దేశంలోని మరి కొన్ని పాస్‌పోర్ట్ కేంద్రాలకు విస్తరించాలని విదేశాంగ శాఖ నిర్ణయించింది.

ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?

ఈ-పాస్‌పోర్ట్ అనేది ఇప్పటి వరకు మీరు వాడుతున్న పాస్‌పోర్టుకు మోడ్రన్ రూపమే. ఈ పాస్‌పోర్టులో ఫిజికల్ మరియు డిజిటల్ లక్షణాలు ఉంటాయి. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్ ఉంటుంది. దాంతో పాటు అంటెన్నా కూడా కలిగి ఉంటుంది. ఇవి మన వ్యక్తిగత సమాచారం, వేలి ముద్రలు, డిజిటల్ ఫోటోగ్రాఫ్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను ఇందులో భద్రంగా నిక్షిప్తం చేస్తాయి. పాస్‌పోర్టు బయట వైపు కవర్‌పై బంగారు చిహ్నం ఏర్పాటు చేస్తారు. పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ నంబర్ వంటి వివరాలు ఇందులో రికార్డయి ఉంటాయి. భద్రతను మరింత పెంచేందుకు ఎన్‌క్రిప్టెడ్ యాక్సెస్‌తో కూడిన కాంటాక్ట్‌లెస్ చిప్ అమర్చుతారు. ఇది ICAO (International Civil Aviation Organization) మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది. ఈ పాస్‌పోర్టు వల్ల నకిలీ పాస్‌పోర్టులు తయారు చేసే అవకాశం చాలా వరకు నిరోధిస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ-పాస్‌పోర్టు అనేది ప్రయాణికుల భద్రత, వేగంగా ప్రయాణికుల గుర్తింపును తనిఖీ చేసేందుకు అధునాతన సాంకేతికతతో తయారైన ట్రావెల్ డాక్యుమెంట్. అయితే, ఈ-పాస్‌పోర్ట్, మామూలుగా మనం వాడే పాస్‌పోర్టుకు ప్రత్యామ్నాయం కాదని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. పాస్‌పోర్ట్ భద్రతను పెంచడం, పారదర్శకతను పెంచడం, అంతర్జాతీయ ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా సులువుగా ప్రయాణం చేసేందుకు ఈ-పాస్‌పోర్టు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే...?

  • ఈ-పాస్‌పోర్ట్ కావాలనుకునేవారు అధికారిక పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లోకి వెళ్లాలి.
  • పోర్టల్‌లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడానికి రిజిస్టర్ చేసుకోవాలి.
  • లాగిన్ అయిన తర్వాత ఈ-పాస్‌పోర్టుకు సంబంధించిన అప్లికేషన్ ఫారంను నింపాలి.
  • ఈ-పాస్‌పోర్టు కోసం ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుం చెల్లించాలి.
  • ఆ తర్వాత మీ సమీపంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK) లేదా పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (POPSK) ను ఎంచుకోండి.
  • మీరు ఎంచుకున్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మీకు సౌలభ్యమైన సమయాన్ని అపాయింట్‌మెంట్ షెడ్యూల్ గా ఎంచుకోండి.
  • మీకు కేటాయించిన అపాయింట్‌మెంట్ రోజున, మీరు ఎంచుకున్న PSK లేదా POPSK కు వెళ్లాల్సి ఉంటుంది.
  • అక్కడ మీ బయోమెట్రిక్ వివరాలు నమోదు చేస్తారు. దాంతో పాటు మీరు సమర్పించే డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తారు.
  • ఆ తర్వాత ఈ-పాస్‌పోర్ట్ జారీ అవుతుంది.                   

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget