Twitter Blue Feature: ట్విట్టర్‌లో సరికొత్త ఫీచర్ ట్విట్టర్ బ్లూ.. డబ్బులు చెల్లిస్తేనే సేవలు.. ప్రీమియం సర్వీసులు ఇవే
ఇతర సామాజిక మాధ్యమాలలో ఉండే ఆప్షన్ లేకపోవడం ట్విట్టర్‌లో మైనస్ పాయింట్‌గా మారింది. ట్వీట్ లో ఏదైనా చిన్న పొరపాటు దొర్లినా డిలీట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ప్రస్తుతం అధికంగా వినియోగిస్తున్నది మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్. మొదట్నుంచీ ట్విట్టర్‌లో యూజర్లు కోరుకున్న ఆప్షన్ ‘ఎడిట్’. ఇతర సామాజిక మాధ్యమాలలో ఉండే ఎడిట్ ఆప్షన్ లేకపోవడం ట్విట్టర్‌లో మైనస్ పాయింట్‌గా మారింది. ట్వీట్ లో ఏదైనా చిన్న పొరపాటు దొర్లినా డిలీట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. మళ్లీ కొత్త ట్వీట్ పోస్ట్ చేయాల్సి వస్తోంది. ఇందుకోసం కొత్తగా ట్విట్టర్ బ్లూ అనే సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్తగా ట్విట్టర్ బ్లూ అనే ప్రీమియం సర్వీస్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది అమెరికా, న్యూజిలాండ్ లలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది పెయిడ్ సర్వీస్. ఇందుకోసం ప్రతినెలా 2.99 డాలర్లు చెల్లించాలి. ఈ ఫీచర్ ఏంటంటే.. మీరు ఏదైనా పోస్ట్ చేసిన తరువాత ఇతరులు చూసేలోపే తొలగించుకునే అవకాశం ఉంది. ‘అన్‌డూ ట్వీట్’ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ట్వీట్ చేశాక కొన్ని సెకన్లపాటు అన్‌డూ ట్వీట్ అని ఆప్షన్ కనిపిస్తుందని... దాన్ని క్లిక్ చేస్తే ట్వీట్ పోస్ట్ అవ్వదని తెలుస్తోంది. ఈ ఫీచర్ లాంఛింగ్‌కు ముందే కొన్ని రోజులపాటు ఉచితంగా సేవలు అందించింది. ఉచిత వెర్షన్ ద్వారా ఆదాయం అంతగా సమకూరడం లేదని ట్విట్టర్ బ్లూ అంటూ ప్రీమియం సర్వీసును తీసుకొచ్చింది.
Also Read: ఐపీఓ షేర్ల కేటాయింపు ఎలా? కొందరికి ఎందుకు కేటాయించరో చూడండి
Twitter Blue launches today in the US with Ad-Free Articles. You can now get an ad-free experience on the WaPo, LA Times, Rolling Stone, The Atlantic and hundreds more. Your subscription directly funds the journalism you read. pic.twitter.com/EJbeQ9I7hS
— Tony Haile (@arctictony) November 9, 2021
ఏమేం సర్వీసులు వచ్చాయంటే..
ఈ ట్విట్టర్ బ్లూ పెయిడ్ కస్టమర్లు మెరుగైన ఫీచర్లు, సర్వీసులు వినియోగించుకుంటారు. అన్‌డూ ట్వీట్ ఆప్షన్, యాడ్స్ లేకుండా వార్తలు చదువుకునే సౌకర్యం సైతం మీకు అందిస్తోందని సీనియర్ డైరెక్టర్ టోనీ హేలీ ట్వీట్ చేశారు. వాపో, ఎల్‌ఏ టైమ్స్, రోలింగ్ స్టోన్, ద అట్లాంటిక్ లలో యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘జర్నలిజంలో కొత్త విధానం కోసం గత పదేళ్లుగా ఎంతో సమయాన్ని వెచ్చించాను. గ్రేట్ జర్నలిజానికి ఇది కొత్త బిజినెస్ మోడల్ కానుంది. దీని ద్వారా ట్విట్టర్ బ్లూ యూజర్ తమ వెబ్‌సైట్‌కు వచ్చినప్పుడు పబ్లిషర్స్‌కు తెలుస్తుంది. ట్విట్టర్ బ్లూ ప్రీమియం సర్వీస్ నుంచి పొందే మొత్తంలో కొంత నగదు న్యూస్ పబ్లిషర్స్‌కు చెల్లిస్తామని టోనీ హేలీ వెల్లడించారు.
Also Read: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు
అమెరికా, న్యూజిలాండ్ దేశాలతో పాటు కెనడా, ఆస్ట్రేలియా వినియోగదారులకు సైతం ట్విట్టర్ బ్లూ సేవలు అందుబాటులో ఉన్నాయి. కెనడా, ఆస్ట్రేలియాల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్‌లో ట్విట్టర్ యాప్ కొనుగోలు చేసిన వారికి సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ట్విట్టర్ ఫ్రీ వెర్షన్ ఎన్నటికీ అలాగే ఉంటుందని, దీని ద్వారా ప్రస్తుత తరహాలోనే రెగ్యూలర్ యూజర్లకు సేవలు అందించాలని ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్‌లో మార్పుల కోసం ట్విట్టర్ బ్లూ ఫీచర్ తీసుకురాగా, భవిష్యత్తులో మరిన్న ఫీచర్లు అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.