Xiaomi Smart TV 5A: రూ.16 వేలలోపే అదిరిపోయే స్మార్ట్ టీవీ - లేటెస్ట్ ఫీచర్లు, సూపర్ డిస్‌ప్లే - నాలుగు టీవీలు లాంచ్ చేసిన షియోమీ!
భారతదేశ నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వీటి ధర రూ.15,499 నుంచి ప్రారంభం కానుంది.
షియోమీ స్మార్ట్ టీవీ 5ఏ సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. 32 ఇంచులు, 40 ఇంచులు, 43 ఇంచుల సైజులో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి. ఇందులో డీటీఎస్-ఎక్స్, డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉన్నాయి. షియోమీ స్మార్ట్ టీవీ 5ఏతో పాటు షియోమీ ఓఎల్ఈడీ విజన్ టీవీ కూడా లాంచ్ అయింది. దీని కాంట్రాస్ట్ రేషియో 1500000:1గా ఉంది. ఐమ్యాక్స్ ఎన్‌హేన్స్‌డ్ సర్టిఫికేషన్ కూడా ఈ టీవీలో అందించారు.
షియోమీ స్మార్ట్ టీవీ 5ఏ సిరీస్ ధర
ఈ సిరీస్‌లో 32 ఇంచుల మోడల్ ధర రూ.15,499గా ఉంది. 40 ఇంచుల మోడల్ ధర రూ.22,999గానూ, 43 ఇంచుల మోడల్ ధర రూ.25,999గానూ నిర్ణయించారు. ఈ టీవీలపై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. అయితే దీనికి హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్స్, ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద దీన్ని కొనుగోలు చేయవచ్చు.
షియోమీ ఓఎల్ఈడీ విజన్ టీవీ ధర
ఈ మోడల్లో 55 ఇంచుల వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.89,999గా నిర్ణయించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే... రూ.6,000 డిస్కౌంట్ అందించనున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం, ఎంఐ హోం స్టోర్లు, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద మే 19వ తేదీ నుంచి ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు.
షియోమీ స్మార్ట్ టీవీ 5ఏ సిరీస్ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ టీవీ సిరీస్ 32 ఇంచులు, 40 ఇంచులు, 43 ఇంచుల మోడళ్లలో లాంచ్ అయింది. 32 ఇంచుల మోడల్‌లో హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేను, 40, 43 అంగుళాల మోడళ్లలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేలను అందించారు. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆధారిత ప్యాచ్‌వాల్ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ టీవీ పనిచేయనుంది. క్వాడ్‌కోర్ కార్టెక్స్-ఏ55 సీపీయూను ఇందులో అందించారు. 1.5 జీబీ వరకు ర్యామ్ కూడా ఇందులో ఉంది. 32 ఇంచుల వేరియంట్‌లో 1 జీబీ ర్యామ్‌ను మాత్రమే అందించారు. మూడు మోడళ్లలోనూ 8 జీబీ స్టోరేజ్‌ను స్టాండర్డ్‌గా అందించారు.
ఇక సౌండ్ విషయానికి వస్తే... 24W సౌండ్ అవుట్‌పుట్‌ను ఈ టీవీ అందించనుంది. డీటీఎస్-ఎక్స్, డీటీఎస్ వర్చువల్-ఎక్స్, డాల్బీ ఆడియోలను ఇది సపోర్ట్ చేయనుంది. 32 ఇంచుల మోడల్‌లో డీటీఎస్:ఎక్స్ సపోర్ట్ అందుబాటులో లేదు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0లను ఈ టీవీ సపోర్ట్ చేయనుంది.
షియోమీ ఓఎల్ఈడీ విజన్ టీవీ స్పెసిఫికేషన్లు
ఈ టీవీ ప్యాచ్‌వాల్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. బెజెల్ లెస్ డిజైన్‌ను కంపెనీ అందించింది. దీని స్క్రీన్. టు బాడీ రేషియో 97 శాతంగా ఉంది. 55 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ టీవీలో అందించారు. ఎంఈఎంసీ, రియాలిటీ ఫ్లో వంటి ఫీచర్లు ఇందులో అందించారు.3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. డాల్బీ విజన్ ఐక్యూ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 కూడా ఇందులో అందించారు.
షియోమీ ఓఎల్ఈడీ విజన్ టీవీ సౌండ్ సిస్టంలో ఎనిమిది డ్రైవర్లు అందించారు. వీటిలో నాలుగు యాక్టివ్ డ్రైవర్లు కాగా... నాలుగు ప్యాసివ్ డ్రైవర్లు ఉన్నాయి. మొత్తంగా 30W సౌండ్ అవుట్‌పుట్‌ను ఇవి అందించనున్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే... షియోమీ ఓఎల్ఈడీ విజన్ టీవీలో మూడు హెచ్‌డీఎంఐ 2.1, రెండు యూఎస్‌బీ, ఒక ఎథర్‌నెట్ పోర్టు ఉండనున్నాయి. ఏవీ ఇన్‌పుట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఆప్టికల్ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు వైఫై 6, బ్లూటూత్ వీ5.0ను ఇది సపోర్ట్ చేయనుంది. షియోమీ ఓఎల్ఈడీ విజన్ టీవీలో ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్లు అందించారు. ఈ టీవీ మందం కేవలం 0.46 సెంటీమీటర్లు మాత్రమే.
Also Read: OnePlus 10: వన్‌ప్లస్ 10 ఫీచర్లు లీక్ - లాంచ్ ఎప్పుడంటే?
Also Read: Realme GT 2: రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - రూ.ఐదు వేల వరకు ఆఫర్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?