50 అంగుళాల ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూసుండరు - 4కే డిస్‌ప్లే కూడా!
ఇన్‌ఫీనిక్స్ జీరో 55 క్యూఎల్ఈడీ,ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 50 స్మార్ట్ టీవీలు మనదేశంలో లాంచ్ అయ్యాయి.
ఇన్‌ఫీనిక్స్ జీరో 55 క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ మనదేశంలో లాంచ్ అయింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రెండు స్మార్ట్ టీవీ మోడళ్లలోనూ 4కే డిస్‌ప్లేలను అందించారు. వీటిలో 55 అంగుళాల మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. దీనికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 22వ తేదీన జరగనుంది. దీంతోపాటు ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 50 అంగుళాల టీవీ కూడా లాంచ్ కానుంది. ఇది డాల్బీ ఆడియోను సపోర్ట్ చేయనుంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో 55 క్యూఎల్ఈడీ ధర
ఈ టీవీ ధరను మనదేశంలో రూ.34,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. మీ పాత స్మార్ట్ టీవీని అమ్మేసి ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.11 వేలు లభించనున్నాయి.
ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 50 స్మార్ట్ టీవీ ధర
ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 50 అంగుళాల స్మార్ట్ టీవీ ధరను రూ.24,990గా నిర్ణయించారు. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,750 అదనపు తగ్గింపు లభించనుంది.
ఇన్‌ఫీనిక్స్ జీరో 55 క్యూఎల్ఈడీ స్పెసిఫికేషన్లు
ఇందులో 55 అంగుళాల 4కే క్యూఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగా ఉంది. యాస్పెక్ట్ రేషియో 16:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉంది. 24w సౌండ్ అవుట్‌పుట్‌ను అందించే స్పీకర్లను ఈ టీవీలో అందించారు. ఇది డాల్బీ ఆడియోను సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది.
పేరు తెలియని క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌పై ఈ టీవీ రన్ అవుతుంది. ఇందులో 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ అందించారు. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి వీడియో స్ట్రీమింగ్ యాప్‌లను ఈ టీవీ సపోర్ట్ చేయనుంది. స్క్రీన్ మిర్రరింగ్, బ్లూటూత్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కనెక్టివిటీ ఫీర్లు ఉన్నాయి. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు కూడా ఉన్నాయి.
ఇన్‌ఫీనిక్స్ ఎక్స్3 50 స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ టీవీ కూడా ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపైనే పనిచేయనుంది. ఇందులో 50 అంగుళాల 4కే ఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని వ్యూయింగ్ యాంగిల్ 178 డిగ్రీలుగానూ, యాస్పెక్ట్ రేషియో 16:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉంది. బెజెల్ లెస్ డిజైన్‌ను ఈ టీవీలో అందించడం విశేషం.
ఇందులో కూడా పేరు తెలియని క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అందించారు. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఈ టీవీల్లో ఉన్నాయి. ఈ టీవీలో బిల్ట్ ఇన్ క్రోమ్‌కాస్ట్ ఉంది. ఎర్గోనోమిక్ రిమోట్‌ను టీవీతో పాటు అందించనున్నారు. మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఈ టీవీల్లో ఉన్నాయి. ఈ టీవీ కూడా 24W సౌండ్ అవుట్‌పుట్‌నే అందించనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?