Telegram Premium: ఆరు నెలల్లోనే 10 లక్షలు - టెలిగ్రాం కొత్త రికార్డు - ఇది మీ దగ్గర కూడా ఉందా?
టెలిగ్రాం ప్రీమియం లాంచ్ అయిన ఆరు నెలల్లోనే 10 లక్షల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటింది.
టెలిగ్రాం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ అయిన ‘టెలిగ్రాం ప్రీమియం’ 10 లక్షల సబ్‌స్క్రిప్షన్ మార్కును దాటింది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. టెలిగ్రాం సీరియస్‌గా మానిటైజేషన్ ప్రారంభించిన ఆరు నెలల్లోనే 1 మిలియన్ మార్కును దాటడం విశేషం.
ప్రస్తుతం టెలిగ్రాంకు 700 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మనదేశంలో టెలిగ్రాం సబ్‌స్క్రిప్షన్ చార్జ్ నెలకు రూ.180 కాగా, ఇతర మార్కెట్లలో ఐదు డాలర్ల నుంచి ఆరు డాలర్ల మధ్యలో ఉంది. టెలిగ్రాం ఓవరాల్ రెవిన్యూలో ఇది చాలా తక్కువ శాతమే అయినా చాలా వేగంగా దీని మార్కెట్ పెరుగుతోందని టెలిగ్రాం ఫౌండర్ పావెల్ దురోవ్ అన్నారు.
టెలిగ్రాం ప్రీమియంలో అదనపు ఫీచర్లు కూడా అందించారు. ఏకంగా 20 చాట్ ఫోల్డర్లు క్రియేట్ చేసుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. 10 చాట్ల వరకు పిన్ కూడా చేసుకోవచ్చు. సోషల్ మీడియా యాప్స్ లాంచ్ చేసిన బెస్ట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌గా ఇది నిలిచిపోనుంది.
టెలిగ్రాం ప్రత్యర్థి యాప్ వాట్సాప్ తన డెస్క్ టాప్ యాప్‌లో కాల్ హిస్టరీని చూపించే ట్యాబ్ తీసుకురానుందని తెలుస్తోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లోని కొంతమంది బీటా టెస్టర్‌ల ద్వారా WhatsApp నుంచి కొత్త కాల్స్ ట్యాబ్ యాప్ సైడ్‌బార్‌లో కనిపించింది. వాట్సాప్ డెస్క్‌టాప్ సైడ్‌బార్‌లో ఉన్న కాల్స్ ట్యాబ్ ప్రస్తుతం Microsoft స్టోర్ నుంచి యాప్ తాజా బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవల ఆండ్రాయిడ్, iOS వినియోగదారులపై ఉన్న వినియోగదారులకు వాట్సాప్ పోల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
అయితే టిప్‌స్టర్ షేర్ చేసిన కాల్స్ ట్యాబ్‌లో లేటెస్ట్ కాల్స్‌ను చూపించడం లేదు.వాట్సాప్ ఇంకా ఈ ఫీచర్‌ను ప్రకటించలేదు. WhatsApp ఇటీవల యాప్‌లో కొత్త ఫీచర్లను విడుదల చేసింది. WhatsApp పోల్స్ గత వారం Android, iOS రెండింటిలోనూ ప్రారంభించారు.
వాట్సాప్‌లో ఇటీవలే మరో సరికొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ‘ఎల్లో పేజెస్’ తరహా ఫీచర్. ఇది వాట్సాప్‌లో బిజినెస్‌లను కనిపెట్టడానికి ఉపయోగపడుతుంది. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. WhatsApp ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్. బ్రెజిల్‌తో మొట్టమొదటగా "డైరెక్టరీ" ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు WhatsApp శుక్రవారం తెలిపింది, దీని ద్వారా వినియోగదారులు సమీపంలోని స్థానిక చిన్న వ్యాపారాలను బ్రౌజ్ చేయవచ్చు, కనుగొనవచ్చు. డైరెక్టరీని మొదట సావో పాలోలో WhatsApp పరీక్షించింది. పూర్తిగా విజయవంతమైన తర్వాత దీన్ని బ్రెజిల్‌లో విడుదల చేయబోతున్నారు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram