అన్వేషించండి

Tecno Spark 8 Pro: 6.8 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఫోన్ రూ.11 వేలలోపే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో మనదేశంలో స్పార్క్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.

టెక్నో స్పార్క్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లేను అందించారు. దీంతోపాటు మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు.

టెక్నో స్పార్క్ 8 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.10,599గా నిర్ణయించారు. కొమొడొ బీచ్, టర్కోయిస్ శాన్, విన్సోర్ వయొలెట్, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. జనవరి 4వ తేదీన అమెజాన్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది.

టెక్నో స్పార్క్ 8 ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2460 పిక్సెల్స్‌గా ఉంది. ఫోన్ ముందువైపు పంచ్ హోల్ నాచ్‌ను అందించారు. 12 ఎన్ఎం ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్‌పై ఈ ప్రాసెసర్‌ను రూపొందించారు.

మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ లెన్స్, ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

ఇందులో చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ వీ7.6 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఇందులో ఉంది.

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Tecno Spark 8 Pro: 6.8 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఫోన్ రూ.11 వేలలోపే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Embed widget