Tecno Spark 20C Sale: టెక్నో స్పార్క్ 20సీ ప్రారంభం - రూ.8 వేలలోపే 16 జీబీ ర్యామ్!
Tecno Spark 20C: టెక్నో స్పార్క్ 20సీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Tecno Spark 20C Amazon Sale: టెక్నో స్పార్క్ 20సీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డైనమిక్ పోర్టు ఫీచర్లను కూడా ఈ ఫోన్‌లో అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అందుబాటులో ఉన్నాయి.
టెక్నో స్పార్క్ 20సీ ధర, ఆఫర్లు (Tecno Spark 20C Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే మార్కెట్లో లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. దీంతోపాటు కంపెనీ లాంచ్ ఆఫర్‌ను కూడా తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ద్వారా రూ.7,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. కేవలం అమెజాన్‌లో మాత్రమే టెక్నో స్పార్క్ 20సీని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.5,604 విలువైన ఓటీటీ ప్లే వార్షిక సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనున్నట్లు టెక్నో తెలిపింది.
టెక్నో స్పార్క్ 20సీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Tecno Spark 20C Specifications)
ఆండ్రాయిడ్ 13 ఆధారిత హైఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో స్పార్క్ 20సీ పని చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్ అందించారు. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఇందులో డైనమిక్ పోర్టు అందించారు. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇందులో చూసుకోవచ్చు.
గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇందులో డార్విన్ ఇంజిన్ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై టెక్నో స్పార్క్ 20సీ రన్ కానుంది. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌ను ఇన్‌బిల్ట్‌గా అందించగా... దీన్ని వర్చువల్‌గా మరో 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కాగా, మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా దీన్ని మరో 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు ఏఐ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. 1080పీ టైమ్ ల్యాప్స్ వీడియోలను ఈ ఫోన్ ద్వారా రికార్డు చేయవచ్చు. ఫోన్ ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.
టెక్నో స్పార్క్ 20సీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. కేవలం 50 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం వరకు ఛార్జింగ్ ఎక్కుతుందని టెక్నో తెలిపింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు కూడా అందించారు.
Be blown away by the Speed - Keep it efficient with TECNOSpark20C ⚡
— TECNO Mobile India (@TecnoMobileInd) March 6, 2024
Powered by Darwin Engine, 16GB* RAM & 128GB ROM.
Sale is now live on @amazonIN.
Shop now: https://t.co/kj9spKOYRC#TECNOSmartphones #MakeASmarterChoice pic.twitter.com/6zgskVvIX6
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?