By: ABP Desam | Updated at : 03 Mar 2022 07:54 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
సింఫనీ చవకైన ఎయిర్ కూలర్ (Image Credits: Symphony)
Symphony Wall Mounted Air Cooler: ప్రస్తుతం మనదేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మేలో ఉక్కపోతలు పీక్స్‌లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ తమ శక్తిని బట్టి ఎయిర్ కండీషనర్ (ఏసీ) కానీ, కూలర్ కానీ కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. ఏసీ ధరలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి... అంత మొత్తం ఖర్చు చేయలేని వారు కూలర్ కొనాలనుకుంటున్నారు.
ప్రస్తుతం మనదేశంలో ఎన్నో కూలర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ సింఫనీ మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ కూలర్ మాత్రం చాలా స్పెషల్. దీన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే చూడగానే ఏసీ అనిపిస్తుంది. కానీ కూలర్ ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు. అదే సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్.
సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్ ధర (Symphony Cloud Personal Cooler with Remote Price)
అమెజాన్‌లో ఈ కూలర్‌ను రూ.13,699కు విక్రయిస్తున్నారు. ఈ కూలర్ అసలు ధర రూ.14,999 కాగా... తొమ్మిది శాతం డిస్కౌంట్‌తో ఇది అందుబాటులో ఉంది. దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. నెలకు రూ.645 చెల్లిస్తూ ఈఎంఐ ద్వారా కూడా ఈ కూలర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనికి ఒక సంవత్సరం వారంటీని కూడా కంపెనీ అందిస్తుంది.
సింఫనీ క్లౌడ్ పర్సనల్ కూలర్ స్పెసిఫికేషన్లు (Symphony Cloud Personal Cooler with Remote Features)
ఈ కూలర్ కెపాసిటీ 15 లీటర్లుగా ఉంది. అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా ఈ కూలర్ అందుబాటులో ఉంది. సుమారు 2,000 చదరపు అడుగుల ప్రాంతాన్ని ఈ కూలర్ చల్లగా ఉంచుతుంది. త్రీ సైడ్ కాలింగ్ ప్యాడ్ కూడా ఇందులో అందించారు.
గదిలో తేమ త్వరగా తగ్గింపోయేందుకు డీహ్యుమిడిఫై సిస్టంను కూడా ఈ కూలర్‌లో అందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కూలర్‌తో పాటు రిమోట్‌ను కూడా అందించనున్నారు. ఈ రిమోట్ ద్వారా కూలర్‌ను కంట్రోల్ చేయవచ్చు. కూలర్‌లో నీళ్లు నింపేందుకు మ్యాజిక్ ఫిల్ అనే పైప్ తరహా డివైస్‌ను కూడా అందించారు. ఇందులో ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయని సింఫనీ అంటోంది.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Motorola 200MP Camera Phone: మోటొరోలా సూపర్ కెమెరా ఫోన్ వచ్చేస్తుంది... 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
Realme Pad X: రూ.15 వేలలోనే రియల్‌మీ ట్యాబ్లెట్ - భారీ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ - ఎలా ఉందో చూశారా?
iPhone 14 Series: ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్ - చైనా మళ్లీ ముంచేసిందిగా!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు