Instagram Account: మీ ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసుకోవాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి
Instagram News: మీ ఇన్‌స్టా అకౌంట్‌తో విసిగిపోయారా.. ఇబ్బందులు పడుతున్నారా.. డిలీట్ చేయడమే మార్గం అని పీలవుతున్నారా.. కానీ ఎలాగో అర్థం కావడం లేదా.. ఇదిగో ఇలా చేయండి
Instagram Account Deleting Procedure: ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌కి ఎడిక్ట్ అయ్యారా. మీ సమయం మొత్తం ఇన్‌స్టా రీల్స్ చూడటంతో వేస్ట్ అయి పోతోందని బాధపడుతున్నారా..? ఇకనైనా మారిపోయి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉందా..? కానీ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలో అర్థం కావడం లేదా..? అయితే మీ సమస్యకు ఇదిగో పరిష్కారం. ఇన్‌స్టా అకౌంట్‌ను ఎలా డిలీట్ చేయాలో సింపుల్ స్టెప్పులు చూడండి.
మీ ఫోన్‌లో ఇన్‌స్టా ఓపెన్ చేయండి
మీ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయండి.
టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న మూడు అడ్డ గీతలపై క్లిక్ చేయండి.
సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్ ఎంచుకోండి.
అక్కడ్నుంచి అకౌంట్స్ సెంటర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అక్కడ్నుంచి అకౌంట్స్ ఓపెన్ చేయండి.
అకౌంట్ ఓనర్ షిప్ అండ్ కంట్రోల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి
అక్కడ మీకు డీయాక్టివేషన్ OR డిలీషన్ అనే ఆప్షన్ కనపడుతుంది.
అక్కడ క్లిక్ చేయగానే మీ పేరుతో ఉన్న అకౌంట్లు మొత్తం చూపిస్తుంది.
మీరు డిలీట్ చేయాలనుకుంటున్న అకౌంట్‌ను ఎంచుకోండి.
మీ అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
అలా కాదు.. భవిష్యత్తులో మళ్లీ వాడుకోవాలని ఉంటే.. టెంపరరీగా డిలీట్ చేయాలనుకుంటే డీయాక్టివేషన్ ఆప్షన్ ఎంచుకోండి.
మీరు డిలీట్ ఆప్షన్ ఎంచుకున్నాక అకౌంట్ ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారో అడుగుతుంది.
కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను.
షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ డిలీట్ చేయాలనుకుంటున్నాను.
సెక్యూరిటీ కారణాలు
ఫాలో కావడానికి సరైన వారు దొరకలేదు
ఇన్‌స్టా వాడటంలో ఇబ్బందిగా ఉంది
బిజిగా ఉండటం వల్ల లేదా నన్ను డిస్టర్బ్ చేస్తున్న కారణంగా
యాడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి
ఇవన్నీ కాదు.. వేరే కారణాలున్నాయి..
పైన సూచించిన ఏదోక ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది.
ఇన్‌స్టా టీమ్ తమ వర్క్ రివ్యూ చేసుకోవడానికి మాత్రమే ఈ వివరాలు అడుగుతుంది. దీనివల్ల మీకొచ్చిన ఇబ్బంది మాత్రం ఏదీ ఉండదు.
ఒకవేళ మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉండి.. దాంతోనే ఇన్‌స్టా కూడా సింక్రనైజ్ అయి ఉంటే గనుక ఇవే ఆప్షన్లతో ఫేస్‌బుక్‌లో కూడా ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసుకోవచ్చు. చివరి ఆప్షన్లలో మీ పేరుతో ఉన్న ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్లను కూడా చూపిస్తుంది. అప్పుడు ఇన్ స్టా అకౌంట్‌ను ఎంచుకున్నా డిలీట్ చేసుకోవచ్చు.