అన్వేషించండి

Samsung Galaxy S21 FE: శాంసంగ్ కొత్త ఫ్లాగ్‌షిప్ లాంచ్ వివరాలు లీక్.. అదిరిపోయే ఫోన్ వచ్చేది ఆరోజే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ మనదేశంలో గెలాక్సీ ఎస్21ఎఫ్ఈని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అది 2022 జనవరిలో లాంచ్ కానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గ్లోబల్ లాంచ్ అయ్యే రోజే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2020 అక్టోబర్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. 2022లో జరగనున్న సీఈఎస్ సదస్సులో వీటిని లాంచ్ చేసే అవకాశం ఉంది. మనదేశంలో కూడా అప్పుడే లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది.

సీఈఎస్ 2022లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుందని గతంలోనే వార్తలు వచ్చాయి. అంటే జనవరిలో ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుందన్న మాట. దీని ముందు వెర్షన్ 2020 అక్టోబర్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో లాంచ్ అయింది. గ్లోబల్ చిప్ షార్టేజ్ కారణంగా దీని సేల్ కూడా మొదట్లో లిమిటెడ్‌గానే జరిగింది.

గతంలో వచ్చిన కథనాల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ తరహాలోనే ఎస్21 ఎఫ్ఈ డిజైన్ కూడా ఉండనుంది. బ్లాక్, గ్రీన్, పింక్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు వైట్, క్రీమ్, లావెండర్ కలర్ ఆప్షన్లలో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 లేదా ఎక్సినోస్ 2100 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. మనదేశంలో వినియోగదారులు మాత్రం ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్‌ను పొందే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ ట్వీటర్‌లో తెగ షేర్ అవుతున్నాయి. ప్లాస్టిక్ బిల్డ్‌తో రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటివరకు వస్తున్న వార్తల ప్రకారం.. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. వైఫై 6, 5జీ, బ్లూటూత్ 5.1 కనెక్టివిటీ కూడా ఇందులో ఉండనున్నాయి. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
IPL 2025 LSG VS RR Result Updates: లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్..  జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్.. జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
Andhra Pradesh Liquor Scam: 8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs DC Match Highlights IPL 2025 | ఢిల్లీ క్యాపిటల్స్ పై 7వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం | ABP DesamRCB Loss in Chinna Swamy Stadium | ఆర్సీబీకి విజయాలను అందించలేకపోతున్న చిన్నస్వామి స్టేడియంPBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్Trolls on RCB for Crossing 49 Runs | జర్రుంటే సచ్చిపోయేవాళ్లు..ఓ రేంజ్ లో RCB కి ట్రోల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: 2025: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేష్ వచ్చేసింది, పూర్తి వివరాలు ఇవే !
IPL 2025 LSG VS RR Result Updates: లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్..  జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. టోర్నీలో ఐదో విజయం.. అవేశ్ సూపర్ బౌలింగ్.. జైస్వాల్ స్టన్నింగ్ ఫిఫ్టీ వృథా
Andhra Pradesh Liquor Scam: 8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
8 గంటల పాటు ప్రశ్నల వర్షం - లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి విచారణ - మళ్లీ పిలుస్తారా?
Narne Hydra: జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల  స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
జూ.ఎన్టీఆర్ మామకు షాక్ -నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్
Raj Kasireddy Audio: బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
బెయిల్ రాగా విచారణకి వస్తా, అన్నీ చెప్పేస్తా, విజయసాయిరెడ్డి చరిత్ర బయటపెడతా- రాజ్‌కేసిరెడ్డి ఆడియో విడుదల 
Viral News: ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్‌లో హైడ్రామా !
ఉద్యోగం నుంచి తీసేశారని ఏఐజీ ఆస్పత్రి పైకి ఎక్కిన మహిళ - దూకేస్తానని బెదిరింపు - బంజారాహిల్స్‌లో హైడ్రామా !
Roja: పవన్ కల్యాణ్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు - రోజాపై రగిలిపోతున్న జనసేన
పవన్ కల్యాణ్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు - రోజాపై రగిలిపోతున్న జనసేన
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడాడు- దుమ్ముురేపాడు
వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడాడు- దుమ్ముురేపాడు
Embed widget