Samsung Galaxy Ring: స్మార్ట్ రింగ్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.1,999కే బుకింగ్!
Samsung Galaxy Ring Sale: శాంసంగ్ గెలాక్సీ రింగ్‌కు సంబంధించిన ప్రీ రిజర్వేషన్లు మనదేశంలో ప్రారంభం అయ్యాయి. రూ.1,999 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ స్మార్ట్ రింగ్‌ను బుక్ చేసుకోవచ్చు.
Samsung Galaxy Ring Pre Reservations: శాంసంగ్ గెలాక్సీ రింగ్‌ను కంపెనీ ఈ సంవత్సరం జులైలో ప్రకటించింది. పారిస్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్లో దీన్ని అనౌన్స్ చేశారు. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 స్మార్ట్ ఫోన్లతో పాటు కంపెనీ దీన్ని లాంచ్ చేసింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ లాంచ్ చేసిన కొత్త ఆవిష్కరణ ఇది. మూడు కలర్ ఆప్షన్లు, తొమ్మిది సైజుల్లో ఇది అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా మనదేశంలో ప్రారంభం అయ్యాయి. దీన్ని కొనుగోలు చేస్తే శాంసంగ్ కొన్ని ఆఫర్లు కూడా అందించనుంది.
శాంసంగ్ గెలాక్సీ రింగ్ ప్రీ రిజర్వేషన్ ఆఫర్లు (Samsung Galaxy Ring Pre Reservations)
శాంసంగ్ గెలాక్సీ రింగ్ ప్రీ రిజర్వేషన్లు మనదేశంలో ప్రారంభం అయ్యాయి. రూ.1,999 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ రింగ్‌ను బుక్ చేసుకోవచ్చు. శాంసంగ్ ఇండియా వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కంపెనీ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. దీన్ని ప్రీ రిజర్వ్ చేసుకున్నవారికి కాంప్లిమెంటరీ వైర్‌లెస్ ఛార్జర్ కూడా లభించనుంది. అలాగే శాంసంగ్ షాప్ యాప్‌లో రూ.5,000 వరకు వెల్‌కమ్ వోచర్ కూడా అందించనున్నారు.
అక్టోబర్ 15వ తేదీ వరకు దీని ప్రీ రిజర్వేషన్ అందుబాటులో ఉండనుంది. అక్టోబర్ 16వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. ఈ రింగ్ ధర (Samsung Galaxy Ring Price in India) మనదేశంలో ఎంతగా ఉండనుందో తెలియరాలేదు. గ్లోబల్ మార్కెట్లలో 399 డాలర్ల (సుమారు రూ.34,000) ధరతో ఇది లాంచ్ అయింది. టైటానియం బ్లాక్, టైటానియం సిల్వర్, టైటానియం గోల్డ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
శాంసంగ్ గెలాక్సీ రింగ్ ఫీచర్లు (Samsung Galaxy Ring Specifications)
శాంసంగ్ గెలాక్సీ రింగ్ మనదేశంలో 5 నుంచి 13 వరకు సైజుల్లో అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. శాంసంగ్ అందించి సైజింగ్ కిట్ ద్వారా యూజర్లకు తమకు కావాల్సిన రింగ్ సైజును ఎంచుకోవచ్చు. టైటానియం కన్‌స్ట్రక్షన్‌తో దీన్ని రూపొందించారు.
10ఏటీయం, ఐపీ68 రేటింగ్స్ కూడా ఈ రింగ్‌లో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే చిన్నదైన 5 సైజ్ రింగు బరువు 2.3 గ్రాములుగా ఉండనుంది. దీని వెడల్పు 7 మిల్లీమీటర్లుగా ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ పెడితే ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.
దీని గ్లోబల్ వెర్షన్ తరహాలోనే ఇందులో కూడా హెల్త్ ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయి. యూజర్ల ఎనర్జీ లెవల్స్, స్లీప్ స్టేజెస్, యాక్టివిటీ, హార్ట్ రేట్, స్ట్రెస్ లెవల్స్ వంటి ఫీచర్లు కూడా అందించారు. ఈ రింగ్ జెస్చర్ కంట్రోల్స్‌ని, శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ ఫైండ్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?