Samsung Galaxy A73: 108 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్ గెలాక్సీ ఏ73ని త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ73 కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ ఎలా ఉండనుందో.. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బిల్డ్‌తో, పంచ్ హోల్ డిస్‌ప్లేతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో రెండు కలర్ వేరియంట్లు ఉండనున్నాయని తెలుస్తోంది.
2022లో లాంచ్ కానున్న ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే శాంసంగ్ ఈ ఫోన్ గురించి ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. డచ్ వెబ్‌సైట్ లెట్స్‌గో డిజిటల్ దీనికి సంబంధించిన రెండర్లను షేర్ చేసింది.
దీనికి ముందు వెర్షన్ అయిన గెలాక్సీ ఏ72 తరహాలోనే దీని డిజైన్ ఉంది. గెలాక్సీ ఏ72లో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. దీని వాల్యూమ్, పవర్ బటన్లు ఫోన్‌కు కుడివైపు ఉన్నాయి. ఫోన్ కింది వైపు యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, సిమ్ ట్రే కూడా అందుబాటులో ఉన్నాయి.
అయితే శాంసంగ్ గెలాక్సీ ఏ73లో మాత్రం 3.5 ఎంఎం జాక్‌ను అందించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ గురించి శాంసంగ్ అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి.. లాంచ్ అయ్యే ఫోన్‌లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను అందించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుందని, సెప్టెంబర్‌లోనే వార్తలు వచ్చాయి.
ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(ఓఐఎస్) ఫీచర్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ ఏ52, గెలాక్సీ ఏ72 స్మార్ట్ ఫోన్లలో ఉంది కాబట్టి గెలాక్సీ ఏ73లో ఉండటం కూడా లాంఛనమే. దక్షిణ కొరియా పబ్లికేషన్ ది ఎలెక్ తెలిపిన దాని ప్రకారం.. దీని ధరను కాస్త తక్కువగానే ఉంచి, చైనీస్ బ్రాండ్లతో పోటీ కోసం సిద్ధం కానున్నట్లు సమాచారం.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. దీన్ని బట్టి ఇందులో 5జీ ఫీచర్ కూడా ఉండనుందని అనుకోవచ్చు.
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!