Samsung Galaxy A06: రూ.10 వేలలోపే శాంసంగ్ కొత్త ఫోన్ - ఏ06ను సైలెంట్‌గా దించిన కంపెనీ!
Samsung New Phone Launch: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన బడ్జెట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ06.
Samsung Galaxy A06 Launched: శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్మార్ట్ ఫోన్ సైలెంట్‌గా మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఎంపిక చేసిన కొన్ని ఆసియా మార్కెట్లలో ఇప్పటికే లాంచ్ అయింది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్ అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని డిజైన్ చూడటానికి శాంసంగ్ గెలాక్సీ ఏ05 తరహాలో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ06 ధర (Samsung Galaxy A06 Price in India)
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో బేస్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.9,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,499గా ఉంది. బ్లాక్, గోల్డ్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Samsung Galaxy A06 Specifications)
శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్మార్ట్ ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్ఎస్ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. ఆక్టాకో్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌ను కూడా ఫోన్ వెనకవైపు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను శాంసంగ్ గెలాక్సీ ఏ06లో చూడవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 189 గ్రాములుగా ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
#Samsung #Galaxy A06 (4G) launched in 🇮🇳
— RaJ∆noop (@anooprajaji) September 3, 2024
💰
4+64GB|128GB ~₹9,999| ₹11,499
Specs〰️
📱6.58" HD+ 60Hz LCD
🔳MTk Helio G85
🍭 A14 | OneUI 6.1
🔋5,000mAh |⚡25W (sold separate)
📸 50MP + 2MP
🤳🏻8MP
👆🏻Side Fs
📀microSD slot
🎧3.5mm jack
⚖️189g
🎨
🩵Blue⬛Black🟨Gold#GalaxyA06 pic.twitter.com/o8jtqFqDv3