Redmi Smart TV: రెడ్‌మీ కొత్త స్మార్ట్‌టీవీలు వచ్చేశాయ్.. సూపర్ ఫీచర్లు.. బడ్జెట్ రేట్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ కొత్త రెడ్‌మీ స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. అవే రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 2022 సిరీస్. వీటిలో 55 అంగుళాలు, 65 అంగుళాల వేరియంట్లు అందించారు.
రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 2022 టీవీలు చైనాలో లాంచ్ అయ్యాయి. ఇందులో రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే, నాలుగేసి స్పీకర్లు ఉన్నాయి.
రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 2022 ధర
ఇందులో 55 అంగుళాల మోడల్ ధరను 2,999 యువాన్లుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.35,100) నిర్ణయించారు. 65 అంగుళాల వేరియంట్ ధర 3,999 యువాన్లుగా(సుమారు రూ.46,800) ఉంది. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. చైనాలో వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 31వ తేదీ నుంచి సేల్ జరగనుంది.
రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ 2022 స్పెసిఫికేషన్లు
ఇందులో ఉన్న రెండు వేరియంట్ల ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. కేవలం స్క్రీన్ సైజులో మాత్రమే మార్పులు జరిగాయి. ఈ రెండిట్లోనూ 4కే ప్యానెల్‌ను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 3840×2160 పిక్సెల్స్‌గా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 10 బిట్ కలర్ డెప్త్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో డాల్బీ విజన్, ఫ్రీ సింక్ ప్రీమియం కూడా అందుబాటులో ఉంది.
వీటిలో క్వాడ్‌కోర్ ఎంటీకే 9650 సీపీయూని అందించారు. నాలుగు కార్టెక్స్ ఏ73 కోర్లు ఈ సీపీయూలో ఉన్నాయి. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు ఏఐ-పీక్యూ, ఏఐ-ఏక్యూ ఇంటెలిజెంట్ ఆడియో కూడా ఇందులో ఉంది. ఆడియో విషయానికి వస్తే.. ఇందులో నాలుగు ఇన్-బిల్ట్ స్పీకర్లు ఉన్నాయి. ఇవి 25W సౌండ్ అవుట్‌పుట్‌ను అందించనున్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
ఇందులో రెండు హెచ్‌డీఎంఐ 2.0 పోర్టులు, ఒక హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు(4కే 120 హెర్ట్జ్), ఒక ఏవీ, ఒక ఏటీవీ/డీటీఎంబీ, రెండు యూఎస్‌బీ, ఒక ఎస్/పీడీఐఎఫ్ పోర్టులు కూడా ఉన్నాయి. దీంతోపాటు ఒక ఆర్జే-45, నాలుగు మైక్ అరేలు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: Oppo K9s: ఒప్పో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర బడ్జెట్‌లోనే.. అదిరిపోయే లుక్!
Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?