అన్వేషించండి

Redmi Note 13 5G Series: మోస్ట్ అవైటెడ్ రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Redmi Note 13 5G Series Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో నోట్ 13 5జీ సిరీస్‌ను లాంచ్ చేసింది. దీని వివరాలు ఇవే.

Redmi Note 13 5G Series Price in India: రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో రెడ్‌మీ నోట్ 13 5జీ (Redmi Note 13 5G), రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ (Redmi Note 13 Pro 5G), రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ (Redmi Note 13 Pro Plus 5G) ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌ను అందించారు. 200 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

రెడ్‌మీ నోట్ 13 5జీ ధర (Redmi Note 13 5G Price in India)
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గానూ, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.21,999గా నిర్ణయించారు. ఆర్కిటిక్ వైట్, ప్రిజం గోల్డ్, స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ధర (Redmi Note 13 Pro 5G Price in India)
ఈ ఫోన్ కూడా మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గానూ, టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.29,999గా ఉంది. ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ అందుబాటులో ఉంది.

రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ ధర (Redmi Note 13 Pro Plus 5G Price in India)
మూడు ఫోన్లలో టాప్ ఎండ్ స్మార్ట్ ఫోన్ ఇదే. దీని ధర రూ.31,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. హైఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గా నిర్ణయించారు. ఫ్యూజన్ బ్లాక్, ఫ్యూజన్ పర్పుల్, ఫ్యూజన్ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఈ మూడు ఫోన్లకు సంబంధించిన సేల్ ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ అవుట్‌లెట్లలో ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా రెడ్‌మీ నోట్ 13 5జీని కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లపై రూ.2,000 తగ్గింపు అందించనున్నారు.

రెడ్‌మీ నోట్ 13 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 1000 నిట్స్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా స్క్రీన్‌కు ప్రొటెక్షన్ అందించనున్నారు. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై రెడ్‌మీ నోట్ 13 5జీ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్ కూడా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

స్టోరేజ్ 256 జీబీ వరకు ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా అందించారు. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్‌కు మూడు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్లు (ఆండ్రాయిడ్ 16 వరకు), నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు లభించనున్నాయి. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 173.5 గ్రాములుగా ఉంది.

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు
ఈ రెండు ఫోన్లలోనూ ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌పై పని చేయనున్నాయి. ఈ రెండు ఫోన్లలోనూ 12 జీబీ వరకు ర్యామ్ అందించారు.

ఈ రెండు ఫోన్లలోనూ 200 మెగాపిక్సెల్ వరకు ప్రైమరీ కెమెరా అందించారు. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలోనూ ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీలో 256 జీబీ వరకు, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీలో 512 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ వైఫై 6 రూటర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. మిగతా మోడల్స్ వైఫై 5 కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లలో ఎన్ఎఫ్‌సీ సపోర్ట్, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.  రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీలో 5100 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
David Warner: శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ భాయ్... 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్‌లో వార్నర్ మెరుపుల్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Embed widget