Realme Pad 2: కొత్త ట్యాబ్లెట్ లాంచ్ చేయనున్న రియల్‌మీ - భారీ డిస్‌ప్లే, బిగ్ బ్యాటరీతో!
రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేయనుంది.
రియల్‌మీ ప్యాడ్ 2 త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది. 2021లో లాంచ్ అయిన రియల్‌మీ ప్యాడ్‌కు ఇది తర్వాతి వెర్షన్. దీనికి సంబంధించిన లాంచ్ పేజీ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ఈ ప్రొడక్ట్ పేజ్ ఇప్పటికే దీని డిస్‌ప్లే స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది. దీనికి సంబంధించిన కలర్ ఆప్షన్లు కూడా బయటకు వచ్చాయి.
రియల్‌మీ ప్యాడ్ 2 రెండు రంగుల్లో లాంచ్ కానుంది. ఇందులో 11.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీనికి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీన్ని బట్టి ఈ ట్యాబ్లెట్ బ్యాటరీ 8360 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్ మనదేశంలో జులై 19వ తేదీన లాంచ్ కానుంది. దీంతోపాటు రియల్‌మీ సీ53 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రొడక్ట్ పేజీ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది. ఈ ల్యాండింగ్ పేజ్‌లో డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు కూడా రివీల్ చేశారు. ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్ జులై 26వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గ్రే, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ట్యాబ్లెట్ కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్‌లో 11.5 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ 2కేగా ఉంది. 120 హెర్ట్జ్ వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను ఈ డిస్‌ప్లే సపోర్ట్ చేయనుంది. ట్యాబ్లెట్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ను ట్యాబ్ వెనకవైపు చూడవచ్చు.
దీని ప్రాసెసర్, స్టోరేజ్, కెమెరా, సాఫ్ట్‌వేర్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్‌లో మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ అందించనున్నారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 8360 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ట్యాబ్లెట్ సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్ పని చేయనుంది.
With the brilliance of colors, the extraordinary visuals, and a 120Hz 2K Super Display that is literally out of this world, the #realmePad2 is here to give your imagination the wings of innovation! #StayTuned
— realme (@realmeIndia) July 17, 2023
Know more: https://t.co/loh686SdLr pic.twitter.com/YXoVp40OtV
Welcome to a world of endless possibilities, where sleekness meets greatness!
— realme (@realmeIndia) July 17, 2023
Introducing the incredible #108MPChampionLikeNeverBefore, a slim masterpiece measuring just 7.99mm.
Stay tuned for the ultimate #ChampionForEveryone
Know more: https://t.co/XMIflMWIUG pic.twitter.com/pdkvby5kH7
Step into a magical world with the unrivaled power of #realmeC53, the sorcerer of photography! Prepare to be spellbound by its 108MP Ultra Clear Camera, which can turn pixels into pure magic.#108MPChampionLikeNeverBefore #ChampionForEveryone
— realme (@realmeIndia) July 17, 2023
Know more: https://t.co/XMIflMWIUG pic.twitter.com/DB8uk63Ha3
Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial