Realme P2 Pro 5G: రియల్‌మీ పీ2 ప్రో 5జీ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఇవే!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ పీ2 ప్రో 5జీ. దీని ధర రూ.21,999 నుంచి ప్రారంభం కానుంది.
Realme P2 Pro 5G Launched: రియల్‌మీ పీ2 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉన్నాయి.
రియల్‌మీ పీ2 ప్రో 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు మనదేశంలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.24,999 గానూ, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 గానూ నిర్ణయించారు. ఈగిల్ గ్రే, ప్యారట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
దీనికి సంబంధించిన ఎర్లీ బర్డ్ సేల్ సెప్టెంబర్ 17వ తేదీన రాత్రి 7 గంటలకు జరగనుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎర్లీ బర్డ్ సేల్ కింద ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,000 కూపన్ డిస్కౌంట్ లభించనుంది. దీంతో పాటు రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించనున్నారు. మూడు నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉండనుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
రియల్‌మీ పీ2 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీన స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ కూడా అందించారు. 4ఎన్ఎం ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై రియల్‌మీ పీ2 ప్రో 5జీ రన్ కానుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5 ఆపరేటింగ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 600 సెన్సార్‌ను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) ఉన్న 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్ కూడా చూడవచ్చు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5200 ఎంఏహెచ్ కాగా 80W వైర్డ్ సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. డ్యూయల్ 5జీ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?