అన్వేషించండి

Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!

Realme New Phone: రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే రియల్‌మీ జీటీ 7 ప్రో. ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది.

Realme GT 7 Pro: రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను అందించారు. 16 జీబీ వరకు ర్యామ్ ఈ ఫోన్‌లో ఉండనుంది. ఇందులో ఏకంగా 6500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్906 సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు పెరిస్కోప్ టెలిఫొటో షూటర్ ఉండనుంది. నవంబర్ 26వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది.

రియల్‌మీ జీటీ 7 ప్రో ధర (Realme GT 7 Pro Price)
రియల్‌మీ జీటీ 7 ప్రో ధర చైనాలో 3,699 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.43,800) ఉంది. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  3,999 యువాన్లుగానూ (సుమారు రూ.47,400), 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  3,899 యువాన్లుగానూ (సుమారు రూ.46,200), 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  4,299 యువాన్లుగానూ (సుమారు రూ.50,900), 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  4,799 యువాన్లుగానూ (సుమారు రూ.56,900) నిర్ణయించారు.

చైనాలో దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయింది. మార్స్ ఎక్స్‌ప్లొరేషన్ ఎడిషన్, స్టార్ ట్రయల్ టైటానియం, లైట్ డొమైన్ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో నవంబర్ 26వ తేదీన రియల్‌మీ జీటీ 7 ప్రో లాంచ్ కానుంది.

రియల్‌మీ జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Realme GT 7 Pro Specifications)
రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.78 అంగుళాల 2కే ఎకో2 స్కై స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 2600 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఇందులో 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.

Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్906 సెన్సార్‌ని అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్ కూడా ఉన్నాయి. 3x, 120x డిజిటల్ జూమ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. అండర్‌వాటర్ ఫొటోగ్రఫీ, లైవ్ ఫొటోలు, ఏఐ బ్యాక్డ్ ఎడిటింగ్ ఫీచర్లను ఇది సపోర్ట్ చేయనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 6500 ఎంఏహెచ్ కాగా, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఉన్నాయి. సెక్యూరిటీ విషయానికి వస్తే... ఇన్‌డిస్‌ప్లే అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు. 5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై 7, బ్లూటూత్ వీ5.4, జీపీఎస్, గెలీలియో, బైదు, క్యూజెడ్ఎస్ఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, శ్రీవాణి టికెట్లు పెంపు
Sai Durgha Tej - Pawan Kalyan: జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనసేనాని నుంచి మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు స్పెషల్ గిఫ్ట్ - దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Embed widget