By: ABP Desam | Updated at : 07 Mar 2022 04:06 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రియల్‌మీ సీ35 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. (Image: Realme)
Realme C35 India Launch: రియల్‌మీ సీ35 (Realme) స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లలో అందించే 50 మెగాపిక్సెల్ కెమెరా (50MP Quad Camera) ఉంది. ఇందులో ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్ కూడా ఉన్నాయి. 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. గతేడాది ఏప్రిల్‌లో లాంచ్ అయిన రియల్‌మీ సీ25కి తర్వాతి వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. రెడ్‌మీ 10 ప్రైమ్, మోటో ఈ40, శాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్లతో ఇది పోటీ పడనుంది.
రియల్‌మీ సీ35 ధర
ఇందులో రెండు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. మార్చి 12వ తేదీ నుంచి వీటి సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాంలతో రిటైల్ అవుట్‌లెట్లలో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ సీ35 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90.7 శాతంగా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను అందించారు. 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇటీవలే లాంచ్ అయిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ జీటీ నియో 2లో అందించిన 50 మెగాపిక్సెల్ కెమెరానే ఇందులో కూడా అందించారు. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. దీని మందం 0.81 సెంటీమీటర్లు కాగా... బరువు 189 గ్రాములుగా ఉంది.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
Realme New Tablet: రియల్‌మీ కింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వచ్చేది అప్పుడే - ఫీచర్లు కూడా లీక్!
Modi Hyderabad Tour Today: నేడే హైదరాబాద్‌కు ప్రధాని, రంగంలోకి 2 వేల మంది పోలీసులు - పూర్తి షెడ్యూల్ ఇదీ
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు