Realme Vs Redmi: రియల్‌మీ 8ఐ వర్సెస్ రెడ్‌మీ 10 ప్రైమ్.. రూ.15 వేలలో బెస్ట్ ఫోన్ ఇదే!
రియల్‌మీ ఇటీవలే తన కొత్త స్మార్ట్ ఫోన్ రియల్‌మీ 8ఐని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ రెడ్‌మీ 10 ప్రైమ్‌తో పోటీ పడనుంది. వీటిలో బెస్ట్ ఫోన్ ఏదంటే?
మనదేశంలో బడ్జెట్ విభాగంలో.. మరీ ముఖ్యంగా రూ.15 వేలలోపు స్మార్ట్ ఫోన్లలో విపరీతమైన పోటీ నెలకొంది. షియోమీ, రియల్‌మీ ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్లతో ఈ విభాగంలో స్మార్ట్ ఫోన్ ప్రియులను పలకరిస్తూనే ఉంటాయి. అలాగే రియల్‌మీ ఇటీవలే రియల్‌మీ 8ఐ అనే కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ షియోమీ తాజాగా లాంచ్ చేసిన రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్‌తో పోటీ పడనుంది. మరి ఈ రెండు ఫోన్లలో ఏ ఫోన్ బాగుంది? వినియోగదారులు పెట్టే డబ్బుకు ఏ ఫోన్ న్యాయం చేయగలదు? అసలు ఏ విభాగంలో ఏ ఫోన్ బెస్టో చూద్దాం..
1. డిస్ ప్లే
రియల్‌మీ 8ఐలో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఇక రెడ్‌మీ 10 ప్రైమ్‌లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. డిస్‌ప్లే సైజు విషయంలో కానీ.. రిఫ్రెష్ రేట్ విషయంలో కానీ రియల్‌మీ 8ఐ పూర్తిగా ముందంజలో ఉంది.
2. ప్రాసెసర్
రియల్‌మీ 8ఐలో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌ను అందించారు. రెడ్‌మీ 10 ప్రైమ్ మాత్రం మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. దీని విషయంలో కూడా రియల్‌మీ 8ఐనే పూర్తిగా ముందంజలో ఉంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌తో గేమింగ్ కూడా చాలా స్మూత్‌గా ఉండనుంది.
3. కెమెరా
రియల్‌మీ 8ఐలో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఇక రెడ్‌మీ 10 ప్రైమ్ విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మరో రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.
సెల్ఫీ కెమెరాల విషయానికి వస్తే.. రియల్‌మీ 8ఐలో 16 మెగాపిక్సెల్, రెడ్‌మీ 10 ప్రైమ్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. వెనకవైపు కెమెరాల్లో రెడ్‌మీ 10 ప్రైమ్ ముందంజలో ఉండగా, సెల్ఫీ కెమెరాల విషయంలో మాత్రం రియల్‌మీ 8ఐ మార్కులు కొట్టేసింది.
4. బ్యాటరీ
రియల్‌మీ 8ఐలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇక రెడ్‌మీ 10 ప్రైమ్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది కూడా 18W ఫాస్ట్ చార్జింగ్‌నే సపోర్ట్ చేయనుంది. ఫాస్ట్ చార్జింగ్ విషయంలో రెండు ఫోన్లూ సమానంగానే ఉన్నా.. బ్యాటరీ సామర్థ్యం విషయంలో రెడ్‌మీ 10 ప్రైమ్ ముందంజలో ఉంది.
5. ధర
ఇది అన్నిటికంటే ముఖ్యమైన అంశం. రెడ్‌మీ 10 ప్రైమ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.14,999గా నిర్ణయించారు.
ఇక రియల్‌మీ 8ఐ విషయానికి వస్తే.. ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.15,999గా నిర్ణయించారు. ప్రారంభ వేరియంట్ విషయంలో రెండు వేరియంట్ల మధ్య రూ.1,500 తేడా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ విషయంలో మాత్రం రూ.1,000 తేడా ఉంది.
ఏది బెస్ట్?
చివరిగా.. మీకు మంచి డిస్‌ప్లే, పవర్ ఫుల్ ప్రాసెసర్ కావాలనుకుంటే.. రియల్ 8ఐ ఎంచుకోవచ్చు. ఇందులో సెల్ఫీ కెమెరా కూడా బాగుంది. ఫీచర్ల దగ్గర కాస్త కాంప్రమైజ్ అయినా.. తక్కువ ధరలో ఫోన్ కావాలనుకుంటే మాత్రం రెడ్‌మీ 10 ప్రైమ్ కొనుగోలు చేయవచ్చు.
Also Read: Microsoft: పాస్‌వర్డ్ మర్చిపోతున్నారా.. మీలాంటి వాళ్ల కోసమే కొత్త టెక్నాలజీ వచ్చింది!
Also Read: Apple Watch Series 7: యాపిల్ కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. అదిరిపోయే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు!