Flipkart Big Billion Days: త్వరలో ప్రారంభం .. ఏకంగా 90 శాతం వరకు తగ్గింపు.. ఆఫర్లు ప్రకటించిన కంపెనీ!
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ లో పలు ఉత్పత్తులపై ఏకంగా 90 శాతం వరకు తగ్గింపును అందించనున్నారు.
ఫ్లిప్ కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన సేల్ తేదీలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే పండగల సీజన్ కూడా త్వరలో వచ్చేస్తుంది. కాబట్టి సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో ఈ సేల్ జరిగే అవకాశం ఉంది.
స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్, ఫ్యాషన్, హోం ఫర్నీషింగ్స్ పై ఫ్లిప్ కార్ట్ విపరీతమైన ఆఫర్లు అందించనుంది. కొన్ని ఉత్పత్తులపై ఏకంగా 90 శాతం వరకు తగ్గింపు అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ మైక్రోసైట్లో తెలిపారు.
ఈ సేల్ కోసం ఫ్లిప్ కార్ట్ ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకులతో భాగస్వామ్యం ఏర్పరచుకోనుంది. వినియోగదారులు పేటీయం వాలెట్ నుంచి చెల్లింపులు చేస్తే వారికి క్యాష్ బ్యాక్ కూడా అందించనున్నారు.
ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ ఎస్ఈలపై ఫ్లిప్ కార్ట్ ఆఫర్లు అందించనుంది. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో శాంసంగ్, ఒప్పో, వివో ఫోన్లపై కూడా తగ్గింపులు లభించే అవకాశం ఉంది.
ఇంటెల్ చిప్ సెట్ ఉన్న ల్యాప్ టాప్ లపై ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపులను అందించనుంది. అలాగే ఇతర ల్యాప్ టాప్ లపై కూడా తగ్గింపులు లభించనున్నాయి. ట్రూవైర్ లెస్ ఇయర్ బడ్స్ పై 60 శాతం వరకు తగ్గింపు లభించనుంది. అలాగే స్మార్ట్ వాచ్ లపై 70 శాతం వరకు, సౌండ్ బార్స్ పై 80 శాతం వరకు తగ్గింపులను అందించనున్నారు.
టీవీలు, ఇతర ఉపకరణాలపై 70 శాతం వరకు తగ్గింపు లభించనుంది. రిఫ్రిజిరేటర్లపై సగం తగ్గింపును అందిస్తూ ఉండటం విశేషం.
ఫ్యాషన్, యాక్సెసరీస్ విభాగంలో 60 నుంచి 80 శాతం తగ్గింపు అందించనున్నారు. ఫర్నీచర్, మాట్రెసెస్ పై ఏకంగా 85 శాతం డిస్కౌంట్ లభించనుంది.
అలాగే ఈ సేల్ కోసం ప్రత్యేకంగా స్పెషల్ లాంచ్ లు కూడా ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్‌లో ప్రతిరోజు 12, 8 గంటలకు సాయంత్రం 4 గంటలకు రష్ ఆవర్స్ పేరిట ఫ్లాఫ్ సేల్స్‌ను కూడా ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
Also Read: iPhone 13 Series: ఐఫోన్ 13 సిరీస్ వచ్చేసింది.. ముందు వెర్షన్ల కంటే తక్కువ ధరకే!
Also Read: Apple Watch Series 7: యాపిల్ కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది.. అదిరిపోయే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు!
Also Read: Apple New iPad, iPad Mini: యాపిల్ కొత్త ఐప్యాడ్లు వచ్చేశాయ్.. ఈసారి కాస్త బడ్జెట్ ధరలోనే!