అన్వేషించండి

Microsoft: పాస్‌వర్డ్ మర్చిపోతున్నారా.. మీలాంటి వాళ్ల కోసమే కొత్త టెక్నాలజీ వచ్చింది!

టెక్ దగ్గజం మైక్రోసాఫ్ట్ తన కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే పాస్‌వర్డ్‌లెస్ ఫ్యూచర్. దీని ద్వారా పాస్‌వర్డ్ లేకుండానే ఖాతాల్లోకి లాగిన్ కావచ్చు.

మీరు జూనియర్ ఎన్టీయార్ నాన్నకు ప్రేమతో సినిమా చూశారా? ఆ సినిమా క్లైమ్యాక్స్‌లో జగపతిబాబు తన డివైస్‌లో పాస్‌వర్డ్ చూసి కంప్యూటర్‌లో ఎంటర్ చేస్తారు. దాన్ని కెమెరా ద్వారా గమనిస్తున్న ఎన్టీయార్ అనుచరులు జగపతిబాబు బ్యాంకు ఖాతాను పూర్తిగా ఖాళీ చేస్తారు. కానీ అక్కడ పాస్‌వర్డ్ కాకుండా ఆ డివైస్‌తోనే బ్యాంకు ఖాతాను కంట్రోల్ చేసే వీలుంటే.. జగపతిబాబుకు పాస్‌వర్డ్ కొట్టాల్సిన అవసరం ఉండేది కాదు. బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యేది కూడా కాదు. సరిగ్గా ఇలా పాస్‌వర్డ్ అవసరం లేని టెక్నాలజీనే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇప్పుడు మీరు పాస్‌వర్డ్ లేకుండానే మీ మైక్రోసాఫ్ట్ ఖాతాను ఉపయోగించవచ్చు. ఇది పాస్‌వర్డ్ కంటే సురక్షితం అయిన పద్ధతి కూడా.. ఎలా అనుకుంటున్నారా? మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ యాప్, విండోస్ హలో, సెక్యూరిటీ కీ, ఎస్ఎంఎస్/వెరిఫికేషన్ కోడ్‌ను మీరు పాస్‌వర్డ్ లాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

పాస్‌వర్డ్‌లెస్ ఫ్యూచర్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. కరోనావైరస్ పాండమిక్ సమయంలో దీన్ని మరింత వేగవంతం చేసింది. అప్పటివరకు ఆఫీస్‌ల్లో పనిచేసిన వారు ఒక్కసారిగా ఇంటి నుంచి పనిచేయాల్సి రావడంతో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సర్ఫేసెస్ సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ విభాగం కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ వాసు జక్కల్ అన్నారు.

దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల సంఖ్య కూడా పెరిగిందని, అందుకు తాము పాస్‌వర్డ్‌లెస్ ఫ్యూచర్ పై చేస్తున్న పరిశోధనను మరింత వేగవంతం చేశామని తెలిపారు. మైక్రోసాఫ్ట్ 2018లోనే సెక్యూరిటీ కీలను ఎనేబుల్ చేసింది. 2019లో విండోస్ 10ను పాస్ వర్డ్ లెస్ చేసింది.

ఇప్పుడు దీంతో మైక్రోసాఫ్ట్ పూర్తిగా 100 శాతం పాస్‌వర్డ్‌లెస్ అయిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఇప్పటికే పాస్‌వర్డ్‌లెస్ ఆప్షన్లను ఉపయోగిస్తున్నారని, భవిష్యత్తులో మరింత మంది వినియోగదారులు దీనివైపు మొగ్గుచూపుతారని జక్కల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పాస్‌వర్డ్‌ని రిమూవ్ చేయడం అంత కష్టమైన పని కూడా కాదు. దీనికి మీ మొబైల్‌లో మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ యాప్ అవసరం. దానికి మీ వ్యక్తిగత మైక్రోసాఫ్ట్ అకౌంట్‌ను లింక్ చేయాలి. ఒక్కసారి అది పూర్తయ్యాక.. account.microsoft.comను సందర్శించాలి. అక్కడ అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఆప్షన్లలో పాస్‌వర్డ్‌లెస్ అకౌంట్లను ఎనేబుల్ చేసుకోవచ్చు.

దీన్ని మీరు మీ మొబైల్‌లో ఉన్న ఆథెంటికేటర్ యాప్ ద్వారా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అయితే భవిష్యత్తులో మీకు కావాలనుకుంటే మీరు మళ్లీ పాస్‌వర్డ్‌ను యాడ్ చేసుకుని పాస్‌వర్డ్ ద్వారా మీ మైక్రోసాఫ్ట్ ఖాతాను ఉపయోగించుకోవచ్చు. 
పాస్‌వర్డ్‌లెస్ ఆథెంటికేషన్ వల్ల కలిగే లాభాలు చాలా స్పష్టం. చాలా మంది గుర్తుండటం కోసం ఒక పాస్‌వర్డ్‌నే అన్ని అకౌంట్లకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో వారి పాస్‌వర్డ్ ఇంకెవరికైనా తెలిస్తే వారి మీకు సంబంధించిన అన్ని ఖాతాలను మరింత సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్ దాడులు ఎక్కువగా జరగడానికి కూడా ఇదే కారణం.

గూగుల్, యాపిల్ వంటి కంపెనీలు కూడా పాస్‌వర్డ్‌ల మీద ఆధారపడటాన్ని తగ్గించే టెక్నాలజీలపై పనిచేస్తున్నాయి. గూగుల్ క్రోమ్‌లో మీరు పాస్‌వర్డ్ లేకుండానే సైన్ ఇన్ అవ్వవచ్చు. ఐవోఎస్ 15, మాక్ఓఎస్‌లు కూడా ఐక్లౌడ్ కీచైన్ ఫీచర్‌పై పనిచేసే పాస్ కీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. పాస్‌వర్డ్‌లు లేకుండా లాగిన్‌ను మరింత సెక్యూర్‌గా ఉంచేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.

Also Read: Samsung New Phone: శాంసంగ్ కొత్త ఫోన్ వ‌చ్చేసింది.. ఆ విష‌యంలో మాత్రం ఇంకా సస్పెన్స్!

Also Read: Apple Watch Series 7: యాపిల్ కొత్త స్మార్ట్ వాచ్ వ‌చ్చేసింది.. అదిరిపోయే హెల్త్ ట్రాకింగ్ ఫీచ‌ర్లు!

Also Read: Apple New iPad, iPad Mini: యాపిల్ కొత్త ఐప్యాడ్లు వ‌చ్చేశాయ్.. ఈసారి కాస్త బ‌డ్జెట్ ధ‌ర‌లోనే!

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget