Realme: రూ.3 వేలు పెట్టి ఇది కొంటే.. మీ సాధారణ టీవీ కూడా స్మార్ట్ టీవీ అయిపోతుంది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో కొత్త టీవీ స్టిక్‌ను లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 4కే గూగుల్ స్మార్ట్ టీవీ స్టిక్.

రియల్‌మీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ స్టిక్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీ స్టిక్‌తో మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోవచ్చు. హెచ్‌డీఆర్10+, 60 ఎఫ్‌పీఎస్, 4కే స్ట్రీమింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
రియల్‌మీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ స్టిక్ ధర
మనదేశంలో దీని ధరను రూ.3,999గా నిర్ణయించారు. అయితే అక్టోబర్ 16వ తేదీ నుంచి జరగనున్న రియల్‌మీ ఫెస్టివ్ డేస్‌లో మాత్రం రూ.2,999కే కొనుగోలు చేయవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అధికారిక ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ టీవీ స్టిక్‌ను కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ స్టిక్ స్పెసిఫికేషన్లు
ఈ టీవీ స్టిక్ గూగుల్ కొత్త టీవీ ప్లాట్‌ఫాంపై పనిచేయనుంది. అదే గూగుల్ టీవీ. ఇందులో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లు కూడా అందించారు. వైఫై, బ్లూటూత్ వీ5, హెచ్‌డీఎంఐ 2.1 పోర్టు వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. రియల్‌మీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ స్టిక్‌లో క్వాడ్‌కోర్ ఏఆర్ఎం కార్టెక్స్ ఏ35 సీపీయూ ఉంది. 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
దీంతోపాటు రియల్‌మీ బ్రిక్ బ్లూటూత్ స్పీకర్, రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2 కూడా మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో రియల్‌మీ బ్రిక్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.2,999 కాగా, రియల్‌మీ ఫెస్టివల్ సేల్‌లో రూ.2,499కే కొనుగోలు చేయవచ్చు. అలాగే రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2 ధరను రూ.3,299గా నిర్ణయించారు. ఆఫర్ సేల్‌లో వీటి ధర రూ.2,599గా ఉంది.
రియల్‌మీ బ్లూటూత్ స్పీకర్‌లో 20W డైనమిక్ బేస్ బూస్ట్ డ్రైవర్లు అందించారు. ఇది 14 గంటల ప్లేబ్యాక్ టైంను అందించనుంది. ఐపీఎక్స్5 వాటర్ రెసిస్టెన్స్, రెండు ఎక్స్‌ట్రా బేస్ రేడియేటర్లు కూడా ఇందులో ఉన్నాయి. రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2ని ఫిబ్రవరిలోనే లాంచ్ చేశారు. మనదేశంలో మాత్రం 8 నెలల తర్వాత అందుబాటులోకి వచ్చాయి. వీటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, 10ఎంఎం డైనమిక్ డ్రైవర్లు, ట్రాన్స్‌పరెన్సీ మోడ్ కూడా ఉన్నాయి.
Also Read: Facebook Server Down: మళ్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. ఇంతకీ ఏమైనట్టు?
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!





















