అన్వేషించండి

Realme 12X: రూ.16 వేలలోపే 24 జీబీ ర్యామ్ - రియల్‌మీ 12ఎక్స్ వచ్చేసింది!

Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. అదే రియల్‌మీ 12ఎక్స్.

Realme 12X Launched: రియల్‌మీ 12ఎక్స్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఎల్సీడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై రియల్‌మీ 12ఎక్స్ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉంది. డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా ర్యామ్‌ను మరింత పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 15W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.

రియల్‌మీ 12ఎక్స్ ధర (Realme 12X Price)
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగా (మనదేశంలో సుమారు రూ.16,000) ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా (సుమారు రూ.18,000) నిర్ణయించారు. బ్లాక్, బ్లూ బర్డ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ 12 5జీ, రియల్‌మీ 12 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇటీవలే మనదేశంలో లాంచ్ అయ్యాయి. కాబట్టి రియల్‌మీ 12ఎక్స్ కూడా మనదేశంలో త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

రియల్‌మీ 12ఎక్స్ స్పెసిఫికేషన్లు (Realme 12X Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ 12ఎక్స్ రన్ కానుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీని పీక్ బ్రైట్‌నెస్ 625 నిట్స్ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ 6 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందుబాటులో ఉంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా దీన్ని 24 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 512 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఐపీ54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్‌ కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని మందం 0.78 సెంటీమీటర్లుగా ఉంది.

మరోవైపు రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ మొబైల్ లాంచ్‌ను కంపెనీ టీజ్ చేసింది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్‌పై రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ పని చేయనుంది. రియల్‌మీ జీటీ నియో 6లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ కానుందని తెలుస్తోంది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget